India Corona: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. తగ్గిన మరణాలు.. నిన్న ఎన్నంటే..?
India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు
India Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశంలో 23 కేసులు నమోదయ్యాయి. కాగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో (మంగవారం) కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్న దేశవ్యాప్తంగా 8,439 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 195 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 93,733 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 555 రోజుల తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,56,822 కి చేరగా.. మరణాల సంఖ్య 4,73,952 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 9,525 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,40,89,137 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
????? ?????https://t.co/cxlNpxfp5v pic.twitter.com/40VRDCIUM8
— Ministry of Health (@MoHFW_INDIA) December 8, 2021
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 129.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశంలో 65.06 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
#??????? ??????????? ??????
➡️ More than 139 Cr vaccine doses provided to States/UTs.
➡️ More than 19.19 Cr doses still available with States/UTs to be administered.https://t.co/ghNs1iLS17 pic.twitter.com/Gl4oK5Tkg3
— Ministry of Health (@MoHFW_INDIA) December 8, 2021
Also Read: