India Corona: దేశంలో కొత్తగా 7,774 కరోనా కేసులు.. నిన్న మరణాలు ఎన్నంటే..?
India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో

India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే.. ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (శనివారం) దేశవ్యాప్తంగా 7,774 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 306 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 560 రోజుల తర్వాత క్రియాశీల కేసుల సంఖ్య కనిష్ఠస్థాయికి చేరింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.36 శాతానికిపైగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,90,510 కి చేరగా.. మరణాల సంఖ్య 4,75,436 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా నిన్న కరోనా నుంచి 8,464 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,41,22,795 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 132.93 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశంలో 65.58 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
COVID19 | India reports 7,774 new cases, 306 deaths and 8,464 recoveries in the last 24 hours; Active caseload at 92,281 pic.twitter.com/pUMkvjVcY4
— ANI (@ANI) December 12, 2021
ఈ క్రమంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు దేశంలో 33 కేసులు నమోదయ్యాయి.
Also Read:




