India Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?
India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం అందోళన కలిగిస్తుంది.
India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోవిడ్-19 థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతుండటం అందోళన కలిగిస్తుంది. కాగా.. గత 24 గంటల్లో కరోనా (Covid-19) కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 2,483 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే 58 కేసులు తగ్గాయి. నిన్న 1399 మరణాలు నమోదయ్యాయి. అయితే.. పలు రాష్ట్రాల్లో నమోదైన మరణాల సంఖ్యను సవరిస్తుండటంతో ఈ సంఖ్య పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 15,636 (0.04 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కరోనా కేసులు, రికవరీల వివరాలు.. ఇలా
-
- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,62,569 కి చేరింది.
- కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,23,622 కి పెరిగింది.
- నిన్న కరోనా నుంచి 1,970 మంది కోలుకున్నారు.
- వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,23,311 కి చేరింది.
- ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.75 శాతం ఉంది.
- ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 187,95,76,423 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- నిన్న 22,83,224 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
COVID-19 | India reports 2,483 fresh cases and 1,970 recoveries, in the last 24 hours. Active cases 15,636
Daily positivity rate (0.55%) pic.twitter.com/BQlCsKd3pe
— ANI (@ANI) April 26, 2022
కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. కట్టడికి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు లేఖ సైతం రాసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా సమావేశం కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు.
Also Read: