JCB Bulldozer: సోషల్ మీడియా నుంచి పొలిటికల్ వరకు బుల్డోజర్లపై చర్చ.. దీని ధర ఎంతంటే..
JCB Bulldozer: సోషల్ మీడియా నుంచి పొలిటికల్ వరకు బుల్డోజర్లపై చర్చ జరుగుతోంది. ఇటీవల బుల్డోజర్ల ద్వారా అనేక అంశాలు వార్తల్లోకెక్కుతున్నాయి. ..
JCB Bulldozer: సోషల్ మీడియా నుంచి పొలిటికల్ వరకు బుల్డోజర్లపై చర్చ జరుగుతోంది. ఇటీవల బుల్డోజర్ల ద్వారా అనేక అంశాలు వార్తల్లోకెక్కుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బుల్డోజర్ల గురించి చాలా చర్చ జరిగింది. బుల్డోజర్ వెలుగులోకి వచ్చిన తర్వాత, దాని అసలు పేరు, దాని పని విధానం, దాని ధరపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాని పేరు జేసీబీ.. ఈ పేరు తర్వాత బుల్డోజర్‌గా సోషల్ మీడియాలో జోరుగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అయ్యాయి. నేరస్తులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగితే వారి ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తానని ప్రకటించడం వైరల్ అయ్యింది. అప్పటి నుంచి దీనిపై చర్చ కొనసాగింది. ఈ బ్యాక్‌హో లోడర్ అని కూడా అంటారు. ఈ యంత్రాన్ని తయారు చేసే కంపెనీ పేరు జేసీబీ. దేశంలో అనేక రకాల బుల్డోజర్ యంత్రాలు పని చేస్తున్నాయి. అయితే బుల్‌డోజర్‌లలో అనేక రకాలుగా చూస్తుంటాము.ఈ బుల్‌డోజర్‌లలో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో బ్యాక్‌హో లోడర్ రంగానికి చెందిన ప్రసిద్ధ సంస్థ అయిన JCB అనేక రకాల బుల్‌డోజర్‌లు అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీని ధర ఎంత?- ప్రతి బుల్డోజర్ దానికి ఉన్న శక్తి ఆధారంగా ధర ఉంటుంది. ఇందులో3D X, JCB 3DX సూపర్, JCB 3D Xtra, JCB 430ZX, JCB 432ZX వంటి రకాలు ఉన్నాయి. ఇందులో JCB 3DX ధర సుమారు రూ. 25 లక్షలు, JCB 3DX సూపర్ ధర సుమారు రూ. 27 లక్షలు, JCB 3DX XTRA రూ. 23 లక్షలు, JCB 3DXL రూ. 19 లక్షలు, JCB 430ZX ధర రూ. 36 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: