Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. నిన్న ఎన్ని పెరిగాయంటే..?
India Coronavirus Updates: దేశంలో కోవిడ్-19 థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల కరోనావైరస్ డైలీ కేసుల సంఖ్య వేయికి
India Coronavirus Updates: దేశంలో కోవిడ్-19 థర్డ్‌వేవ్ అనంతరం రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇటీవల కరోనావైరస్ డైలీ కేసుల సంఖ్య వేయికి దిగువన నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల సంఖ్య వేయి దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,088 కరోనా కేసులు (Corona) నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటి రేటు 0.25 శాతం ఉంది. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 26 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ప్రస్తుతం 10,870 (0.03) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే 292 కేసులు పెరగగా.. మరణాలు 7 పెరిగాయి.
తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,30,38,116 కి పెరిగాయి. ఈ మహమ్మారితో ఇప్పటివరకు 5,21,736 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 1081 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,05,410 కి చేరింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.76 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,86,07,06,499 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న 15,05,332 టీకాలను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
COVID-19 | India reports 1,088 fresh cases, 1081 recoveries, and 26 deaths in the last 24 hours.
Daily positivity rate (0.25%) pic.twitter.com/CIw6vbcPka
— ANI (@ANI) April 13, 2022
Also Read: