AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: వామ్మో.. మళ్లీ కరోనా పంజా.. ఏడుగురు మృతి.. దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

దేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అది కొత్త రూపంలో పంజా విసురుతోంది. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. యాక్టివ్‌ కేసుల సంఖ్య వెయ్యి దాటేశాయి.. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసంది.

Coronavirus: వామ్మో.. మళ్లీ కరోనా పంజా.. ఏడుగురు మృతి.. దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
India Coronavirus Cases
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2025 | 3:45 PM

Share

కరోనావైరస్ కొత్త రూపంలో పంజా విసురుతోంది. భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం జనంలో గుబులు పుట్టిస్తోంది. దేశంలో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు.. యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా బాగా పెరిగింది.. చాప కింద నీరులా చల్లగా పాకేస్తోన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో వెయ్యి దాటిపోయింది.. తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలో బాధితులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై కోవిడ్ నిబంధనల్ని, టెస్టులను చేయడం మొదలుపెట్టింది.

దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి పైగా ఉంది. కేరళలో 403, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, కర్నాటకలో 47, ఉత్తరప్రదేశ్ 15, పశ్చిమ బెంగాల్ లో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించారు.

దేశంలోని కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత అధికంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనే వందకు చేరింది. దేశంలో గత వారం రోజులలో 752 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 335 కొత్త కేసులు మహారాష్ట్రలో 153 కేసులు, ఢిల్లీలో 99 కొత్త కేసులు వెలుగుచూశాయి.

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అలర్ట్ చేసంది. అన్ని సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేసుకోవాలని సూచించింది.. రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం నిపుణులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..