MP Curfew Extended: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా ఉధ‌ృతి.. మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

కరోనా నేపథ్యంలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునేలా కేంద్రం వీలు కల్పించింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నియంత్రణలో భాగంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మే 7వ తేదీ వరకు కర్ఫ్యూను పొడగించింది.

MP Curfew Extended: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న కరోనా ఉధ‌ృతి.. మే 7 వరకు లాక్‌డౌన్ పొడిగింపు
Corona Curfew Extended In Madhya Pradesh
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 29, 2021 | 12:49 PM

MP Curfew Extended: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అయా రాష్ట్రాలకే లాక్ డౌన్ నిర్ణయాన్ని కట్టబెట్టింది. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునేలా వీలు కల్పించింది. ఈ నేపథ్యంలోనే కోవిడ్ నియంత్రణలో భాగంగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మే 7వ తేదీ వరకు కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం భోపాల్‌, ఇండోర్‌తో పాటు ప్రధాన నగరాలు సహా పలు జిల్లాల్లో కరోనా కర్ఫ్యూతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. ముఖ్య పట్టణాలతో పాటు 13 జిల్లాలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా కేసులు పెరగుతున్న వివిధ జిల్లాల్లో కూడా లాక్‌డౌన్ విధించేలా అయా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితిపై సమీక్షించారని ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తం మిశ్రా తెలిపారు. కర్ఫ్యూపై ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకునేందుకు జిల్లాస్థాయి కమిటీలకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు. పది జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిందని, మరో 13 ఇతర జిల్లాల్లో స్థిరంగా ఉందని మిశ్రా చెప్పారు.

ఆరు జిల్లాల్లో 50 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని, మూడు జిల్లాల్లో వైరస్‌ను సమర్థవంతంగా అరికట్టినట్లు పేర్కొన్నారు. ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, జబల్‌పూర్‌, ఉజ్జయిని సహా కొన్ని జిల్లాల్లో విస్తరిస్తున్న వైరస్‌ ఆందోళన కలిగిస్తోందని, పరిస్థితిపై సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న నివారి, డాటియా జిల్లాల నుంచి బస్సు సర్వీసులను నిలిపివేసేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి… రెండు రోజుల్లో రాష్ట్రానికి 29 ఆక్సిజన్‌ ట్యాంకర్లు చేరుకుంటాయని తెలిపారు. ఇదిలావుంటే, మధ్యప్రదేశ్‌లో బుధవారం 12,758 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 105 మంది ప్రాణాలను కోల్పోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Read Also…  కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!