Bharat Bandh Chakka Jam : చక్కాజామ్‌పై హైటెన్షన్.. రిపబ్లిక్‌డే నాటి ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు
గణతంత్ర దినోత్సనం నాడు ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింస దేశ ప్రజలను ఇప్పటికే కలవరపెడుతోంది. శనివారం రైతు సంఘాలు తలపెట్టిన చక్కాజామ్.. రహదారుల దిగ్భంధంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది..
Bharat Bandh Chakka Jam : గణతంత్ర దినోత్సనం నాడు ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింస దేశ ప్రజలను ఇప్పటికే కలవరపెడుతోంది. శనివారం రైతు సంఘాలు తలపెట్టిన చక్కాజామ్.. రహదారుల దిగ్భంధంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. అయితే యూపీ,ఉత్తరాఖండ్, ఢిల్లీలో చక్కాజామ్ ఉండదని రైతు సంఘాలు ప్రకటించాయి.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శనివారం తలపెట్టిన చక్కాజామ్‌పై టెన్షన్ వాతావరణం నెలకొంది. రిపబ్లిక్ డే నాడు జరిగిన ఘటనలు రిపీట్ కాకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ఢిల్లీ శివార్ల లోని సింఘు బోర్డర్ , ఘజియాబాద్, టిక్రీ సరిహద్దులను అష్టదిగ్భంధనం చేశారు. రైతులు ముందుకు కదలకుండా రోడ్లపై పెద్ద పెద్ద మేకులు బిగించారు. కాంక్రీట్ గోడలను నిర్మించారు. ఎత్తైన బారికేడ్లను ఏర్పాటు చేశారు.
రహదారులు దిగ్భంధపై రైతు సంఘాల కీలక ప్రకటన
అయితే జాతీయ రహదారుల దిగ్భంధంపై రైతు సంఘాలు కీలక ప్రకటన చేశాయి. ఢిల్లీ శివార్లతో పాటు ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలను చక్కాజామ్ నుంచి మినహాయింపు ఇస్తునట్టు ప్రకటించారు రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయత్. ఈ రాష్ట్రాల నుంచి రైతులు సాఫీగా ఢిల్లీ చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు చక్కాజామ్
శనివారం మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు..మూడు గంటల పాటు రోడ్స్ బ్లాక్ చేయాలని పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. కిసాన్ పరేడ్ ఘటన రిపీట్ అవకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. రైతులను నిలువరించేందుకు సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలు, మేకులు, కాంక్రీట్ వాల్స్ నిర్మిస్తున్నారు. పోలీసులు, జవాన్లపై ఎలాంటి దాడులు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యవసాయ చట్టాలపై రాజ్యసభలో ప్రసంగించారు తోమర్. రైతులు నీళ్లతో వ్యవసాయం చేస్తుంటే..కాంగ్రెస్ నేతలు వారి రక్తంతో వ్యవసాయం చేస్తారా అని ప్రశ్నించారు. రైతులను కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. దీంతో తోమర్ ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డు తగలగంతో సభలో కొద్దిసేపు గందరగోళమేర్పడింది.
కాంగ్రెస్ నేతల విమర్శలు
అయితే తోమర్ వ్యాఖ్యలపై మండిపడింది కాంగ్రెస్.. గోద్రా అల్లర్లలో రక్తంతో వ్యవసాయం చేసింది బీజేపీ నేతలే అని విమర్శించారు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్. వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో ప్రతిష్టాంభన కొనసాగుతోంది. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సభ నిర్వహణపై స్పీకర్ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సహకరించాలని విపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు . రాజ్యసభ మాత్రం రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన తరువాత వాయిదా పడింది.
ఇవి కూడా చదవండి
ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..? Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ