దేహమే మందిరం.. ఒళ్లంతా పచ్చ బొట్లు.. ఆ తెగ పలుకులోనూ, పనిలోనూ నిత్యం మర్యాదా పురుషోత్తముడే

చత్తీస్ ఘడ్ అడవులు అందాలకే కాదు భక్తికి, ఆచారాలకు నెలవు..ఆ ఊరిలో రామాలయం లేదు కానీ దేహమే దేవాలయం చేసుకున్న గొప్ప భక్తులు ఉన్నారు. అవును మీరు వింటున్నది నిజమే..

దేహమే మందిరం.. ఒళ్లంతా పచ్చ బొట్లు.. ఆ తెగ పలుకులోనూ, పనిలోనూ నిత్యం మర్యాదా పురుషోత్తముడే
Follow us

|

Updated on: Feb 05, 2021 | 8:08 PM

చత్తీస్ ఘడ్ అడవులు అందాలకే కాదు భక్తికి, ఆచారాలకు నెలవు..ఆ ఊరిలో రామాలయం లేదు కానీ దేహమే దేవాలయం చేసుకున్న గొప్ప భక్తులు ఉన్నారు. అవును మీరు వింటున్నది నిజమే…రాముడి నుంచి తమను ఏ శక్తి వేరు చేయలేదని నిరూపిస్తూ.. ఒళ్లంతా రామ నామంతో పచ్చ బొట్లు పొడిపించుకొంటోంది ఓ తెగ. కొన్ని వందల ఏళ్లనాటి నుంచి ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ..రాముడి మీద తమకున్న అపార భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తోంది.

చత్తీస్‌గఢ్‌ జిల్లాలోని జంజీర్‌చాపా, సారంగఢ్‌ జిల్లాలో ఒక తెగ ఉంటుంది. వారిని రామ్‌నామి అని పేరుతో పిలుస్తారు. వీరికి శ్రీరాముడంటే అమితమైన భక్తి. గతంలో వీరికి దేవాలయాల్లో ప్రవేశం లేకపోవడం వల్ల వారి దేహాన్నే రామాలయంగా మార్చుకొని శరీరం మొత్తం పచ్చబొట్లు వేయించుకున్నారు. ఈ తెగలోని వారంతా పూర్తిగా శాకాహారులు.. ప్రతిరోజు రామాయణం పారాయణం చేస్తారు. వీరి ఇళ్లల్లో ఏదైనా శుభకార్యం లేదా అశుభం జరిగినా శ్రీరాముని భజన చేస్తారు. ప్రతి ఏటా పుష్యమాసం శుక్ల ఏకాదశి రోజు నుంచి మూడు రోజుల పాటు మేళా నిర్వహిస్తారు. ఈ మేళను తిలకించేందుకు విదేశాల నుంచి సైతం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు.

వీరికి రామాలయం అనేది ప్రత్యేకంగా ఉండదు..కేవలం రామనామ స్మరణ చేస్తారు. ఈ మేళాలో తమజాతికి చెందిన యువతీ, యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తారు. ఇలా వారి జీవన విధానంలోని ప్రతీ పనిని, ప్రతీ శుభకార్యాన్ని రామ నామంతోనే ముడి పెడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అనునిత్యం రామనామస్మరణలో స్మరిస్తూ..శరీరమంతా పచ్చబొట్లు పొడిపించుకోవడం ఆ తెగలో ఆనవాయితీగా వస్తోంది.

Also Read:

ఆమె జీవితం కష్టాల కల్లోలం.. పొట్టకూటి కోసం కాటికాపరిగా మారిన వైనం.. ముత్యాల అరుణ కన్నీటి గాథ

ఆలయంలో తల వెంట్రుకలు దొంగతనం చేశారు.. అడ్డంగా దొరికిపోయారు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?