ఆమె జీవితం కష్టాల కల్లోలం.. పొట్టకూటి కోసం కాటికాపరిగా మారిన వైనం… ముత్యాల అరుణ కన్నీటి గాథ
మహిళలు చాలాచోట్ల స్మశానానికి వెళ్లరు. అటువంటిది ఓ మహిళ.. కాటికాపరి వృత్తినే ఎంచుకుంది. కట్టుకున్నవాడు కడతేరిపోతే కాటికాపరై బతుకుబండి లాగుతోంది.
మహిళలు చాలాచోట్ల స్మశానానికి వెళ్లరు. అటువంటిది ఓ మహిళ.. కాటికాపరి వృత్తినే ఎంచుకుంది. కట్టుకున్నవాడు కడతేరిపోతే కాటికాపరై బతుకుబండి లాగుతోంది. కళ్లముందే కళేబరాలు కనిపిస్తున్నా.. ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ముందడుగు వేసింది. ఆమె ఈ వృత్తిని ఎంచుకుని ఎవరూ చేయని సాహసాన్ని చేస్తోంది. ఆ మహిళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణ.
అడుగడునా కష్టాలతో ముడిపడిన ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అరుణ తల్లి క్యాన్సర్‌తో చనిపోయారు. ఇక తోబుట్టువులన్నా ఆదుకుంటారనుకుంటే… వారు కూడా మధ్యలోనే అశువులు బాసారు. ప్రమాదానికి గురైన తండ్రి మంచానికే పరిమితమయ్యారు. భర్త కాటికాపరిగా పనిచేశారు. అయితే మద్యానికి బానిసై అనారోగ్యంతో మృతిచెందారు. భర్త చనిపోవడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. దీంతో భర్త చేసే వృత్తినే తన బతుకుతెరువుగా మార్చుకుని తనతో పాటు, 15 మంది కుటుంబ సభ్యులకు ఆమె ఆధారంగా నిలిచింది. అనాధ మృతదేహాలకు అన్నీ తానై అంతిమ సంస్కారాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచింది.
గ్రామ పంచాయతీ వారు ఈమెకు నెలకు 7500 మాత్రమే జీతం ఇస్తుంది. కానీ, అవి శవాల దహన సంస్కారాలకు కిరోసిన్, డీజీల్‌లకు సరిపోతుంది. మృతదేహాల బంధువులు ఎవరో ఒకరు మాత్రమే 500 రూపాయలు చేతిలో పెట్టి వెళతారని అరుణ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు తమను తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అరుణ కోరింది.
Also Read:
China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ