హాఫిజ్ సయీద్‌పై పాక్‌వి కంటితుడుపు చర్యలు- భారత్
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినచర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్థాన్ దేశం ఎట్టకేలకు తలొగ్గింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హాఫిజ్ సయీద్‌తోపాటు 12 ఉగ్రవాద సంస్థలపై 23 కేసులు నమోదు చేస్తూ పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలోని జమాత్ ఉద్ దావా (జుడ్)తోపాటు 12 సంస్థలు ఉగ్రవాదులకు నిధులు అందించేందుకు విరాళాలు వసూలు చేస్తుందని పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంట్ 23 కేసులు పెట్టింది. పాకిస్థాన్ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు […]

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినచర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి పాకిస్థాన్ దేశం ఎట్టకేలకు తలొగ్గింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హాఫిజ్ సయీద్‌తోపాటు 12 ఉగ్రవాద సంస్థలపై 23 కేసులు నమోదు చేస్తూ పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలోని జమాత్ ఉద్ దావా (జుడ్)తోపాటు 12 సంస్థలు ఉగ్రవాదులకు నిధులు అందించేందుకు విరాళాలు వసూలు చేస్తుందని పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంట్ 23 కేసులు పెట్టింది. పాకిస్థాన్ దేశంలోని స్వచ్ఛంద సంస్థలు దావత్ ఇర్షాద్ ట్రస్టు, మోయిజ్ బిన్ జబల్ ట్రస్టు, అల్ అన్ఫాల్ ట్రస్టు, అల్ మదీనా ఫౌండేషన్ ట్రస్టు, అల్ హమద్ ట్రస్టులు ఉగ్రవాదుల కోసం విరాళాలు వసూలు చేశారని పాక్ కౌంటర్ టెర్రరిజం డిపార్టుమెంట్ కేసులు పెట్టింది.
అయితే ఇవన్నీ ఆర్భాట చర్యలుగా భారత్ అభివర్ణించింది. కేవలం బయట దేశాల ముందు హడావిడికి తప్పితే..ఉగ్రవాద నిర్మూలన విషయంలో పాక్ చిత్తశుద్ది లేదని తేల్చి చెప్పింది. నిబద్దతతో కాకుండా కేవలం పై పై చర్యలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని స్పష్టం చేసింది.
