India Coronavirus: స్వల్పంగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. కేరళలో ఒకే రోజు 129 మంది కరోనాతో మృతి

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నప్పటికీ.. ఈ రోజు మాత్రం కొద్దిగా పెరిగాయి. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది.

India Coronavirus: స్వల్పంగా పెరిగిన కోవిడ్ పాజిటివ్ కేసులు.. కేరళలో ఒకే రోజు 129 మంది కరోనాతో మృతి
Coronavirus
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 15, 2021 | 9:46 AM

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నప్పటికీ.. ఈ రోజు మాత్రం కొద్దిగా పెరిగాయి. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో బుధవారం కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 27,176 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. కరోనా మహమ్మారి కారణంగా 284 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇదిలావుంటే కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న దేశంలో నమోదైన కరోనా కేసుల్లో.. కేరళలో 15,876 కరోనా కేసులు నమోదు కాగా.. 129 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 80 శాతానికి పైగా కరోనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,33,16,755 కి పెరగగా.. మరణాల సంఖ్య4,43,497 చేరింది. నిన్న కరోనా నుంచి 38,012 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,25,22,171 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,51,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,89,12,277 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. గడిచిన 24గంటల్లో 61,15,690 మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి: Mudanammakalu: కడుపునొప్పికి భూత వైద్యురాలి ట్రీట్మెంట్.. నొప్పి ఎంతకూ తగ్గకపోవడంతో వైద్యుడి వద్దకు.. కట్ చేస్తే..

100 Years: మొదటి ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు వందేండ్లు.. ఇవాళ అఖిల భారత శాసన సభాపతుల సదస్సు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే