Corona New Variant: కోరలు చాస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు

| Edited By: Subhash Goud

Dec 25, 2023 | 10:54 AM

అటు నెల రోజుల వ్యవధిలో 3 వేల మందికిపైగా జనాలు కరోనా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1తో వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో భూమ్మీద నూకలుండాలంటే మళ్లీ ముక్కుకు నోటీకి మస్ట్‌గా మాస్క్ పెట్టాల్సిందే. దేశంలో కరోనా పరేషాన్‌ చేస్తోంది. తప్పిపోయిందీ అనుకున్న ముప్పు.. రూపం మార్చి మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ JN-1 ..

Corona New Variant: కోరలు చాస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు
India Corona
Follow us on

దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ హడలెత్తిస్తోంది. గతంలో ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసినా కరోనా.. ఇప్పుడు కొత్తవేరియంట్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా మళ్లీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగనే మోగాయి. ఈ కొత్త వేరియంట్‌ విజృంభిస్తుండటంతో కేసులు నెల రోజుల్లో 52 శాతం పెరిగాయి. అంటే కరోనా కేసులు విజృంభణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల 5 వేలకుపైగా మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనాతో లక్ష 18వేల మంది ఆస్పత్రిపాలైయ్యారు.

అటు నెల రోజుల వ్యవధిలో 3 వేల మందికిపైగా జనాలు కరోనా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1తో వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో భూమ్మీద నూకలుండాలంటే మళ్లీ ముక్కుకు నోటీకి మస్ట్‌గా మాస్క్ పెట్టాల్సిందే. దేశంలో కరోనా పరేషాన్‌ చేస్తోంది. తప్పిపోయిందీ అనుకున్న ముప్పు.. రూపం మార్చి మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ JN-1 తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో ఇప్పటివరకు ఉన్న కరోనా లెక్కలు ఓకసారి ట్రాక్ చేద్దాం..!

కోరలు చాస్తున్న కరోనా కొత్త వేరియంట్‌

ఇవి కూడా చదవండి

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ కొరలు చాస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో ప్రజలను మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో కరోనా పరేషాన్ చేస్తోంది. ఇక దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు, ఒకరు మృతి చెందినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. కేరళ, కర్నాటక, తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. దేశంలో 3,742 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా, తెలుగురాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ JN-1 మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 38 యాక్టివ్ కేసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు 18కి చేరాయి.

మెదక్‌ జిల్లాలో పెరుగుతున్న కేసులు:

మెదక్‌ జిల్లాలో కూడా కరోనా మరోసారి కలవరపెడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులో జనం హడలిపోతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు పాజిటివ్ కేసులు నమోదవడంతో కరోన అనే పేరు వింటేనే వణికిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 6 కేసులు నమోదు కాగా, అందులో అందులో ఒకరికి నెగటివ్ రాగా ప్రస్తుతం యాక్టివ్ లో ఐదు కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు, కంది (మం) మామిడిపల్లిలో ఒకరికి కరోన సోకగా.. మెదక్ జిల్లాలో ఒకటి, సిద్దిపేట జిల్లాలో ఒకటి నమోదు అయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగు తుండటంతో జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు వైద్యులు. మరో వైపు కరోన పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కల్ ధరించాలి అని సూచనలు చేస్తున్నారు వైద్య అధికారులు.. ఇప్పటికే ఉపయోగం లేని కరోన వార్డులను అన్ని బాగుచేసి వాటిని ఉపయోగంలోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు ఉన్నత అధికారులు.

కరోనా మహమ్మారి ప్రజలను వదలడం లేదు. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం, మరణాలు నమోదవ్వడం.. మూడేళ్ల కిందటి పీడకలను మళ్లీ గుర్తు చేస్తోంది. జెఎన్1 పేరుతో పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రజలు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి