CM Revanth Reddy: కాంగ్రెస్ గ్యారెంటీల హామీలు అమలుకు ఈ కార్డు కీలకం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అస్త్రంగా మలిచి యుద్దానికి సిద్దమైంది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే రెండు గ్యారెంటీల అమలు ఫైలుపై సంతకాలు చేశారు. ఇందులో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు.

CM Revanth Reddy: కాంగ్రెస్ గ్యారెంటీల హామీలు అమలుకు ఈ కార్డు కీలకం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
Cm Revanth Reddy
Follow us
Srikar T

|

Updated on: Dec 24, 2023 | 10:18 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అస్త్రంగా మలిచి యుద్దానికి సిద్దమైంది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే రెండు గ్యారెంటీల అమలు ఫైలుపై సంతకాలు చేశారు. ఇందులో మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అలాగే ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేసుకునే పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు రేవంత్. ఈ సమావేశంలో ప్రభుత్వం అమలు చేయాలనుకున్న హామీలపై అధికారులకు దిశానిర్థేశం చేశారు. ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఆరు గ్యారెంటీలు లబ్ధిదారునికి వర్తించాలంటే రాష్ట్రప్రభుత్వం తెల్ల రేషన్ కార్డును తంబ్ రూల్‎గా చేయనుంది. అంటే తెల్లరేషన్ కార్డును ప్రధాన అర్హతగా నిర్ణయించనుందన మాట. దీనికి సంబంధించిన విధివిధానాలు రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. డిశంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ప్రజాపాలన సభలను నిర్వహించనున్నారు అధికారులు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామసభలకు వచ్చే వారి నుంచి చిత్తశుద్ధితో దరఖాస్తులు తీసుకుంటామని.. వారి కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశించారని పేర్కొన్నారు. గ్రామ సభల నిర్వహణకు కావాల్సిన నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి పరిస్థితులు చూసి వారు ఏఏ పథకాలకు అర్హులు అనే విషయాలను రికార్డులో నమోదు చేసుకోనున్నారు. ఒక వేళ తెల్ల రేషన్ కార్డు లేకపోతే.. ఆరు గ్యారెంటీలు పొందేందుకు అనర్హునిగా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి.ద

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ