Corona Cases India: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా.. మరోసారి 90 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు.!

Corona Cases India: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది...

Corona Cases India: భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా.. మరోసారి 90 వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2021 | 11:34 AM

Corona Cases India: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అలాగే వైరస్ కారణంగా 446 మంది మృటి చెందారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,26,86,049 కరోనా కేసులు నమోదు కాగా.. 1,65,547 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.

కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 50,143 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,17,32,279కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,88,223 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.48శాతం ఉండగా.. మరణాల రేటు 1.30శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 12,11,612 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 25,02,31,269 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది.

Also Read:

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

”నువ్వు తోపు.. అయితే నాకేంటి”.. మొసలిని లెక్క చేయని జీబ్రా.. ఏం జరిగిందంటే.!

అద్భుత రికార్డు.. 13 బంతుల్లో 10 వికెట్లు పడగొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్.. అతడు ఎవరంటే.!

Shocking: మొక్క కాదు “యమపాశం’..తాకితే తగలబెడుతుంది.. అసలు ఎందుకో తెలుసా.?