Prison break: రాజస్థాన్‌లో రెచ్చిపోయిన ఖైదీలు.. జైలు గార్డుల కళ్లల్లో కారం కొట్టి.. 16 మంది పరార్..
Prison break in Rajasthan: రాజస్థాన్‌లో ఖైదీలు రెచ్చిపోయారు. ఏకంగా జైలు గార్డుల కళ్లలో కారం, మిరియాల పొడి చల్లి
Prison break in Rajasthan: రాజస్థాన్‌లో ఖైదీలు రెచ్చిపోయారు. ఏకంగా జైలు గార్డుల కళ్లలో కారం, మిరియాల పొడి చల్లి ఆపై వారిని కొట్టి జైలు నుంచి పారిపోయారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా ఫలోడి సబ్ జైలులో సోమవారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 16మంది ఖైదీలు పారిపోయారని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి జైలు మెస్‌లో ఉన్న మహిళా గార్డుల కళ్లలో కారం కొట్టడంతో వారు కిందపడి గాయపడ్డారు. అనంతరం జైలు గార్డుల కళ్లలో మిరియాల పొడి చల్లి వారిని కొట్టి 16 మంది ఖైదీలు పారిపోయారని మంగళవారం అధికారులు వెల్లడించారు. పారిపోయిన ఖైదీల్లో ముగ్గురు బీహార్ రాష్ట్ర ఖైదీలని, మిగిలిన వారు ఫలోడి, బాప్, లోహవట్ ప్రాంతాలవారని అధికారులు తెలిపారు. వీరంతా డ్రగ్స్ కేసులో నిందితులని పేర్కొన్నారు.
ఖైదీల పరారీ అనంతరం ఫలోడి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ యష్ పాల్ ఆహుజా సీనియర్ అధికారులతో కలిసి జైలును పరిశీలించారు. పారిపోయిన ఖైదీలను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు ఇప్పటికే అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేశామన్నారు. ఫలోడి పట్టణంలో 7 ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బస్సులు, రైళ్లు, అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. సీసీ టీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.
Also Read: