AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు వర్తించవు’.. హైకోర్టు సంచలన తీర్పు..!

మతం మార్పిడులు, రిజర్వేషన్ల ప్రయోజనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాల నుండి ఇస్లాం మతంలోకి మారిన వారికి "వెనుకబడిన తరగతి ముస్లిం" (BCM) కేటగిరీ కింద రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పూర్తిగా కొట్టివేసింది.

‘మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు వర్తించవు’.. హైకోర్టు సంచలన తీర్పు..!
Madras High Court
Balaraju Goud
|

Updated on: Jun 26, 2026 | 3:11 PM

Share

మతం మార్పిడులు, రిజర్వేషన్ల ప్రయోజనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇతర వెనుకబడిన వర్గాల నుండి ఇస్లాం మతంలోకి మారిన వారికి “వెనుకబడిన తరగతి ముస్లిం” (BCM) కేటగిరీ కింద రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పూర్తిగా కొట్టివేసింది.

వివాదాస్పద ప్రభుత్వ ఉత్తర్వు ఏమిటి?

2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం… వెనుకబడిన తరగతి (BC), అత్యంత వెనుకబడిన తరగతి (MBC), డినోటిఫైడ్ కమ్యూనిటీస్ (DNC), షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వ్యక్తులు ఇస్లాం మతంలోకి మారినప్పటికీ, వారు ‘బీసీ ముస్లిం’ (BCM) కేటగిరీ కింద రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం కొనసాగించవచ్చని పేర్కొంది. అంతేకాకుండా, ప్రభుత్వం నోటిఫై చేసిన ఏడు ప్రత్యేక బీసీ ముస్లిం వర్గాలలో ఒకదానికి చెందిన సభ్యులుగా వారిని గుర్తిస్తూ కమ్యూనిటీ సర్టిఫికేట్లు జారీ చేయడానికి కూడా ఈ ఉత్తర్వు అనుమతించింది.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తమిళనాడు ప్రభుత్వ భావన చట్టపరంగా మరియు భావనాత్మకంగా పూర్తిగా తప్పని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. “ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి వెనుకబడిన తరగతి ముస్లిం (BCM) హోదాను పొందలేరని మేము నిర్ధారిస్తున్నాము. మతం మారిన వ్యక్తి కేవలం ఒక ముస్లిం మాత్రమే అవుతాడు, అంతే తప్ప ప్రత్యేక వర్గానికి చెందడు” అని కోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రత్యేక వెనుకబడిన ముస్లిం వర్గాలలో అన్సార్, దక్కనీ ముస్లింలు, దుబేకుల, లబ్బాయి, మాపిళ్ళ, షేక్, సయ్యద్ ఎవరైనా కొత్తగా మతం మారిన వారిని సభ్యునిగా పరిగణించడం సాధ్యం కాదని, అందువల్ల వారు ఆ వర్గం కింద రిజర్వేషన్లు పొందడానికి అర్హులు కారని కోర్టు తేల్చి చెప్పింది.

జూలై 2008లో జారీ చేసిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా తమిళనాడులోని పైన పేర్కొన్న ఏడు ముస్లిం వర్గాలను ప్రత్యేక BCM కేటగిరీలో చేర్చారు. అయితే, ఇతర సామాజిక వర్గాల నుండి ఇస్లాంలోకి మారిన వారికి కూడా ఈ సర్టిఫికేట్లు ఇవ్వాలనే 2024 నాటి ప్రభుత్వ నిర్ణయం చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో తమిళనాడు ప్రభుత్వానికి దౌత్యపరంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us