కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక తేదీ ఖరారు.. వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నిక కోసం రంగం సిద్ధమవుతోంది.

  • Rajitha Chanti
  • Publish Date - 3:20 pm, Fri, 22 January 21
కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక తేదీ ఖరారు.. వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం..

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం రంగం సిద్ధమవుతోంది. జూన్ 21న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. శుక్రవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎలక్షన్ అథారిటీ ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. అలాగే కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని ఈ సమావేశంలో చర్చించారు. అలాగే కరోనా వ్యాక్సిన్ అభివృద్ది చేసిన శాస్త్రవేత్తలపై సీడబ్ల్యూసీ అభినందనలు తెలిపింది. ఇక వాట్సప్ చాట్ లీక్ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.