కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి రాజీవ్ త్యాగి ఇక లేరు

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాజీవ్ త్యాగి గుండెపోటుతో క‌న్నుమూశారు. గుజియాబాద్‌లోని త‌న నివాసంలో ఇవాళ గుండెపోటుతో రాజీవ్ త్యాగి మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి అయిన రాజీవ్ త్యాగి ఆక‌స్మిక మ‌ర‌ణింపై..

కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి రాజీవ్ త్యాగి ఇక లేరు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2020 | 9:23 PM

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత రాజీవ్ త్యాగి గుండెపోటుతో క‌న్నుమూశారు. గుజియాబాద్‌లోని త‌న నివాసంలో ఇవాళ గుండెపోటుతో రాజీవ్ త్యాగి మ‌ర‌ణించారు. ఈ విష‌యాన్ని అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి అయిన రాజీవ్ త్యాగి ఆక‌స్మిక మ‌ర‌ణింపై పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. రాహుల్, ప్రియాంక‌ల‌కు అత్యంత స‌న్నిహితుల్లో రాజీవ్ త్యాగి ఒక‌రు. ఆయ‌న మ‌ర‌ణంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విషాదంలో ముగినిపోయారు. కాగా గ‌తేడాది అక్టోబ‌ర్‌లో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ ఆయ‌న‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ మీడియా ఇన్‌చార్జిగా నియ‌మించారు. త్యాగి కాంగ్రెస్ జాతీయ ప్ర‌తినిధిగానే కాకుండా పార్టీలో వివిధ హోదాల్లో ప‌ని చేశారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రాజీవ్ త్యాగి ఆయ‌న కీల‌కంగా ప‌ని చేశారు.

Read More:

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వ హెచ్చ‌రిక‌

ప‌నికి రావ‌డం లేద‌ని 12 ఏళ్ల బాలుడిని చావ‌గొట్టిన య‌జ‌మాని

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం