ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దర్ని కొట్టిచంపిన నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు ఇన్ఫార్మర్లన్న నెపంతో తీవ్రంగా కొట్టించంపేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని..

  • Tv9 Telugu
  • Publish Date - 7:49 pm, Thu, 23 July 20
ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దర్ని కొట్టిచంపిన నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు ఇన్ఫార్మర్లన్న నెపంతో తీవ్రంగా కొట్టించంపేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్లి మిచ్చిపర గ్రామంలో ఉండే కొందరు వ్యక్తుల్ని నక్సల్స్ తీవ్రంగా కొట్టారు. పోలీసులకు ఇన్ఫార్మర్లన్న నెపంతో ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో నక్సల్స్ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ స్పందించారు. నక్సల్స్‌లోని రెండు వర్గాల మధ్య అంతర్ఘత కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు.