AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఎందుకో తెలుసా..?

ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన తండ్రి గొంతు కోసి హత్య చేసింది. కోర్బా జిల్లా హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలియా గ్రామంలోని లిముండా బస్తీలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని 55 ఏళ్ల అశోక్ కుమార్ కేవత్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్..  ఎందుకో తెలుసా..?
Hardi Bazar Case
Balaraju Goud
|

Updated on: Feb 11, 2026 | 2:00 PM

Share

ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన తండ్రి గొంతు కోసి హత్య చేసింది. కోర్బా జిల్లా హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలియా గ్రామంలోని లిముండా బస్తీలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని 55 ఏళ్ల అశోక్ కుమార్ కేవత్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

లిముండా బస్తీకి చెందిన అశోక్.. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా వారి నుండి విడిగా నివసిస్తున్నాడు. అతని భార్య పిల్లలు కోర్బాలోని ఆదిలే చౌక్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అశోక్ తన భార్య, పెద్ద కుమార్తె వ్యక్తిత్వాన్ని అనుమానించాడు. దీని ఫలితంగా ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతను భార్య కుమార్తెలను వదిలి విడివిడిగా నివసిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తుండగా, ఒకరు చదువుకుంటున్నారు.

ఫిబ్రవరి 9న అశోక్ భార్య, ముగ్గురు కుమార్తెలు భూ పరిహారం చెల్లింపు పనుల కోసం సొంత గ్రామానికి వచ్చారు. ఆ రోజు రాత్రి గ్రామంలోనే ఉన్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అశోక్ కేవత్, అతని పెద్ద కుమార్తె గీతా కేవత్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాదన సమయంలో, తండ్రి తన కుమార్తె పట్ల అసభ్యకరమైన భాషను ఉపయోగించాడని, దాంతో కోపోద్రిక్తురాలైన కుమార్తె గీత అతనిపై దాడి చేసింది. ఈ క్రమంలోనే అర్థరాత్రి నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చింది. కొడవలితో తన తండ్రిపై దాడి చేసి, అతని గొంతు కోసింది. సంఘటన తర్వాత, ఆమె స్వయంగా ఇంటి నుండి బయటకు వెళ్లి, తన తండ్రిని చంపినట్లు బంధువులకు చెప్పింది. సమాచారం అందుకున్న మృతుడి సోదరుడు సంతోష్ కుమార్ ఇంటికి వచ్చాడు. అక్కడ అశోక్ రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నాడు.

ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న హార్ది బజార్ పోలీసులు అక్కడికి చేరుకుని నిందితురాలు గీతను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు అశోక్ కేవత్ మద్యానికి బానిసయ్యాడని, కుటుంబ కలహాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే, హత్యకు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు చాలా కాలంగా ఉన్న కుటుంబ వివాదం దారితీసిందా అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు గీతా కేవత్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉండేదని సమాచారం. కొంతకాలం క్రితం, ఆమె ఒక యువకుడితో ఒక వీడియోను షేర్ చేసింది. ఇది వివాదానికి దారితీసింది. సైబర్ సెల్‌లో కేసు కూడా నమోదైంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..