వ్యాపారిపై వలపు వల విసిరిన లేడీ ఆఫీసర్.. ఏకంగా హోటల్‌ని కూడా రాయించుకున్న డీఎస్పీ
హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరేసిందేమో అన్నట్లుంటుంది పర్సనాలిటీ..! దేవుడిచ్చిన అందాన్ని, సర్కారు ఇచ్చిన యూనిఫాంని మిక్స్ చేసి వలపు వల విసిరిందా కిలేడీ ఖాకీ. ఛత్తీస్‌గఢ్‌లో ఓ బిజినెస్ మేన్‌ని ట్రాప్‌లోకి లాగింది. అతన్ని బకరాని చేసేసిందో లేడీ డీఎస్పీ. యూనిఫాం సర్వీస్‌లో ఉన్న స్టన్నింగ్ బ్యూటీతో ఫ్రెండ్‌షిప్ చేసి వ్యాపారి మోసపోయాడు. ఇప్పుడా లేడీ పోలీస్‌పైనే కేసు పెట్టడం యూనిఫామ్ డిపార్ట్‌మెంట్‌ని షేక్ చేస్తోంది.

హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరేసిందేమో అన్నట్లుంటుంది పర్సనాలిటీ..! దేవుడిచ్చిన అందాన్ని, సర్కారు ఇచ్చిన యూనిఫాంని మిక్స్ చేసి వలపు వల విసిరిందా కిలేడీ ఖాకీ. ఛత్తీస్‌గఢ్‌లో ఓ బిజినెస్ మేన్‌ని ట్రాప్‌లోకి లాగింది. అతన్ని బకరాని చేసేసిందో లేడీ డీఎస్పీ. యూనిఫాం సర్వీస్‌లో ఉన్న స్టన్నింగ్ బ్యూటీతో ఫ్రెండ్‌షిప్ చేసి వ్యాపారి మోసపోయాడు. ఇప్పుడా లేడీ పోలీస్‌పైనే కేసు పెట్టడం యూనిఫామ్ డిపార్ట్‌మెంట్‌ని షేక్ చేస్తోంది.
ప్రేమ పేరుతో మోసాలు, హనీట్రాప్‌లూ రోజూ ఎన్నో చూస్తున్నాం. కానీ ఇది కాస్త డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఎవరైనా చీట్ చేస్తే పోలీసుల దగ్గరికి పరిగెడతాం. అలాంటిది పోలీస్ ఆఫీసరే ముగ్గులోకి లాగితే.. కోట్లకు కోట్లు పిండేసి నోరెత్తితే ఊచలు లెక్కపెట్టిస్తానని బెదిరిస్తే ఎలా ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో ఓ వ్యాపారికి నిండా మునిగాక కానీ తత్వం బోధపడలేదు.
ఓ బిజినెస్ మేన్‌ని ప్లాన్డ్‌గా లవ్ ట్రాప్‌లో పడేసిందో లేడీ పోలీసాఫీసర్. అన్ని రకాలుగా పిండేసింది. పిప్పి తప్ప ఇంకేం మిగల్లేదనుకుందో ఏమోచల్‌రే చల్ అనేసింది. అప్పుడు గానీ ఆ బిజినెస్‌మేన్‌కి బుర్ర పనిచేయలేదు. నేనేంటీ.. అంత అందమైన డీఎస్పీ నాకు దగ్గరవ్వడమేంటీ అని ఓసారి రీల్ గిర్రున తిప్పితే.. ట్రాప్‌లో పడ్డాననే స్పృహ వచ్చింది. నమ్మించి మోసం చేసిందంటూ డీఎస్పీ కల్పనావర్మపై కంప్లయింట్ చేశాడు వ్యాపారి దీపక్ టండన్.
ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దీపక్‌ని నిలువు దోపిడీ చేసింది మహిళా డీఎస్పీ. కోట్ల రూపాయల క్యాష్ తీసుకుంది. ఆమె అందానికి ఫిదా అయిపోయి ఖరీదైన కార్లు, ఆభరణాలు సమర్పించుకున్నాడు వ్యాపారి. ఇక షాపింగ్‌లు చేయించి ఎన్ని బిల్లులు కట్టాడో చెప్పేందుకే సీసీ ఫుటేజీలనే సాక్ష్యంగా చూపిస్తున్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తానని డీఎస్పీ కల్పనావర్మ బెదిరించిందని వ్యాపారి దీపక్ టండన్ చెబుతున్నాడు.
దీపక్ టండన్ ఫిర్యాదు ప్రకారం.. కల్పనా వర్మను ఆయన మొదటిసారి 2021లో కలిశారు. మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ సంబంధం క్రమంగా మరింత దగ్గరగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో డీఎస్పీ తరచూ డబ్బు డిమాండ్ చేసేదని దీపక్ ఆరోపించారు. ఇప్పటిదాకా ఆమెకు 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఇచ్చానంటున్నాడు. మహిళా డీఎస్పీకి ఏమేం ఇచ్చానో లిస్ట్ చెప్పేస్తున్నాడు. రూ. 12 లక్షల విలువైన డైమండ్ రింగ్, రూ. 5 లక్షల గోల్డ్ చైన్, టాప్స్, లక్ష రూపాయల విలువైన బ్రాస్‌లెట్, మేడమ్ తిరగడానికో ఇన్నోవా క్రిస్టా కారు అడగ్గానే ఇచ్చేశాడట అమాయక చక్రవర్తి.
రాయ్‌పూర్ వీఐపీ రోడ్డులో ఉన్న దీపక్ వర్మ హోటల్‌ని తనసోదరుడి పేరుతో రిజిస్టర్ చేయించుకుంది డీఎస్పీ కల్పనావర్మ. తరువాత రూ. 30 లక్షలు ఖర్చుపెట్టి ఆ హోటల్‌ను తన పేరుకు మార్చుకుందని వ్యాపారి దీపక్ ఆరోపించాడు. అక్కడితోనే ఆగలేదు. దీపక్ భార్య పేరుతో ఉన్న రూ. 22 లక్షల కారు కూడా తీసుకుంది. ఆమె దగ్గర నుంచి 45 లక్షల రూపాయల చెక్కు కూడా తీసుకుంది. డబ్బులు తిరిగి అడిగితే బ్లాక్‌మెయిలింగ్ మొదలుపెట్టింది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని డీఎస్పీ కల్పన ఒత్తిడి తెచ్చినట్లు దీపక్ టండన్ ఫిర్యాదు ఇచ్చాడు.
డీఎస్పీ కల్పనావర్మ మోసానికి సాక్ష్యంగా వాట్సాప్ చాట్స్, సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులకు ఇచ్చాడు వ్యాపారి దీపక్ టండన్. అయితే, ఇవన్నీ అబద్దాలంటున్నారు డీఎస్పీ కల్పనావర్మ. తనను బద్నాం చేయడానికే తప్పుడు ఫిర్యాదు చేశారంటున్నారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదని బుకాయిస్తున్నారు. ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు. వారిద్దరి మధ్య జరిగినట్లు చెబుతున్న వాట్సాప్ మెసేజ్‌లు, సీసీ ఫుటేజ్ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డిపార్ట్‌మెంట్‌కి మచ్చగా మారిన ఈ ఆరోపణలపై రాయ్‌పూర్ పోలీస్ శాఖ లోతుగా ఎంక్వైరీ చేస్తోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




