Election Result: ఛత్తీస్‌గఢ్‌లో సజావుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు

|

Dec 03, 2023 | 9:29 AM

ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం 47 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. 41 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు.

Election Result: ఛత్తీస్‌గఢ్‌లో సజావుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరీ పోరు
Chhattisgarh Assembly Election Counting Is A Fierce Battle Between Bjp And Congress
Follow us on

ఛత్తీస్‌గఢ్ విషయానికొస్తే 33 జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు 90 మంది రిటర్నింగ్ అధికారులు, 416 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 1,698 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం 47 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. 41 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు ఒక స్థానంలో కొనసాగుతున్నారు. ఇక్కడ మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 కాగా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కైవసం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1.181 మంది అభ్యర్థుల బరిలో నిలువగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బగల్ మరో సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అంటున్నారు. బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కాంగ్రెస్‌ను ప్రజలు గద్దెదించేందుకు సిద్దమయ్యారని రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. పైగా మోదీ ప్రచార ప్రభావం తీవ్రంగా చూపుతుందని చెబుతున్నారు బీజేపీ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..