AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టూరిజంలో సరికొత్త ట్రెండ్.. తమిళనాడు వెళ్లే టూరిస్ట్‌లు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే

తమిళనాడు పర్యటనకు వెళ్లే టూరిస్ట్‌లకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పాలి.ఎందుకంటే చెట్టినాడు ఇప్పుడు సంప్రదాయ భవనాలను చూసే సాధారణ పర్యాటకం నుండి మారిన కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. కేవలం భవనాలను చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా, పర్యాటకులు అక్కడి వారసత్వంతో మమేకం కావాలనే లక్ష్యంతో సరికొత్త విధానాన్ని రూపొందించిం. అదేంటో చూద్దాం పదండి.

టూరిజంలో సరికొత్త ట్రెండ్.. తమిళనాడు వెళ్లే టూరిస్ట్‌లు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే
Chettinad Heritage Tourism
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 3:28 PM

Share

తమిళనాడులోని సంప్రదాయానికి పెట్టింది పేరు చెట్టినాడు. భారీ భవంతులు, రుచికరమైన వంటకాలతో పర్యాటకులను ఆకర్షించే ఈ ప్రాంతం ఇప్పుడు తన పర్యాటక విధానాన్ని మార్చేసింది. కేవలం భవనాలను చూసి ఫోటోలు దిగి వెళ్ళిపోవడం కాకుండా, పర్యాటకులు అక్కడి వారసత్వంతో మమేకం కావాలనే లక్ష్యంతో సారథి వంటి సంస్థలు సరికొత్త కార్యక్రమాలను రూపొందించాయి. పర్యాటకులు ఇక్కడికి వచ్చే ముందే ఆ ప్రాంత చరిత్ర, వాస్తుశిల్పం,  సంస్కృతిపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని, అక్కడికి వచ్చాక ఆ అంశాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఈ హోం వర్క్ లో భాగంగా పర్యాటకులు కేవలం సందర్శకులుగా మిగిలిపోకుండా, స్థానిక హస్తకళలైన అత్తంగుడి టైల్స్ తయారీని స్వయంగా చూడటం, కందంగి చీరల నేతను అర్థం చేసుకోవడం, సంప్రదాయ ముగ్గులైన కోలం వేయడంలో శిక్షణ పొందడం వంటివి చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చెట్టినాడు వంటల తయారీలో వాడే సుగంధ ద్రవ్యాల మిశ్రమం వెనుక ఉన్న రహస్యాలను వర్క్‌షాప్‌ల ద్వారా నేర్చుకోవచ్చు. దీనివల్ల పర్యాటకులకు ఆ ప్రాంతంతో ఒక విడదీయలేని అనుబంధం ఏర్పడుతుందని, పర్యాటకం ద్వారా స్థానిక జీవనశైలిని కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.

ముఖ్యంగా శిథిలావస్థకు చేరుతున్న చెట్టినాడు వారసత్వ భవంతులను కాపాడుకోవడమే ఈ వినూత్న ప్రయత్నం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. పర్యాటకులు ఆయా భవంతులలో బస చేసినప్పుడు, వాటి నిర్మాణంలో వాడిన బర్మా టేకు, ఇటాలియన్ మార్బుల్స్ ,నాటి ఇంజనీరింగ్ అద్భుతాల గురించి లోతుగా తెలుసుకోవడం వల్ల ఆ కట్టడాల విలువ పెరుగుతుంది. ఒక సాధారణ విహారయాత్రను అర్థవంతమైన అభ్యాస ప్రక్రియగా మార్చడం ద్వారా, చెట్టినాడును కేవలం ఒక పర్యాటక ప్రాంతంగానే కాకుండా ఒక సజీవ మ్యూజియంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి