AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మాతృ దేశం కోసం భారత సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివిః ప్రధాని మోదీ

భారత్-పాకిస్థాన్ మధ్య 60 రోజుల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కార్గిల్ కొండలను అధిరోహించింది. భారత భూభాగంలోని 15 వేల అడుగుల ఎత్తైన కార్గిల్ శిఖరాలను పాక్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కానీ భారత సైనికులు, అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, పాక్ సైనికుల ఆక్రమణ నుండి కార్గిల్‌ను విడిపించారు.

PM Modi: మాతృ దేశం కోసం భారత సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివిః ప్రధాని మోదీ
Kargil Vijay Diwas 25
Balaraju Goud
|

Updated on: Jul 26, 2024 | 12:23 PM

Share

భారత్-పాకిస్థాన్ మధ్య 60 రోజుల పాటు కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ సైన్యం రహస్యంగా కార్గిల్ కొండలను అధిరోహించింది. భారత భూభాగంలోని 15 వేల అడుగుల ఎత్తైన కార్గిల్ శిఖరాలను పాక్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కానీ భారత సైనికులు, అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించి, పాక్ సైనికుల ఆక్రమణ నుండి కార్గిల్‌ను విడిపించారు. మాతృ భూమి రక్షణ కోసం జరిగిన కార్గిల్ యుద్ధంలో 500 మందికి పైగా ధీరులు అమరులయ్యారు. భారత సైనికుల జ్ఞాపకార్థం ఇక్కడ స్మారక చిహ్నం నిర్మించడం జరిగింది.

కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. 1999వ సంవత్సరంలో ఇదే రోజున భారత సైన్యానికి చెందిన వీర సైనికులు పాకిస్థాన్‌పై విజయం సాధించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా పేర్కొన్నారు.

“ఈరోజు కార్గిల్‌విజయ్‌కి 25సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది భారతదేశ చరిత్రలో నిర్ణయాత్మక ఘట్టం. పాకిస్తాన్ సైనికులు భారత భూభాగంలోకి లోతుగా చొరబడ్డారు, దీంతో భారత్ ఆపరేషన్ విజయ్‌ను ప్రారంభించింది. భారత సైన్యం భీకర పోరాటాలు చేసింది. ప్రతి అంగుళం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. మన దేశ సమగ్రతను కాపాడింది. అటువంటి యుద్ధభూమి టైగర్ హిల్, ఇది యుద్ధం అత్యంత తీవ్రమైన పోరాటాన్ని చూసే వ్యూహాత్మక వాన్టేజ్ పాయింట్. జూలై 4, 1999న, కనికరంలేని, రక్తపాత యుద్ధం తర్వాత, టైగర్ హిల్‌పై భారత బలగాలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విజయం జూలై 26, 1999న భారత భూభాగం నుండి పాకిస్తాన్ చొరబాటుదారులను తుదముట్టించడానికి మార్గం సుగమం చేసింది. కార్గిల్ యుద్ధం ముగుస్తున్న తరుణంలో, సైనికులు వారికి మద్దతుగా నిలిచిన నాయకుల అచంచలమైన స్ఫూర్తికి సంబంధించిన మరో గాథ లిఖించబడుతోంది.” అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికుల జ్ఞాపకార్థం ఇక్కడ స్మారక చిహ్నం నిర్మించారు. ఇది భారత సైనికులకు అంకితం చేశారు. ఇక్కడ అమర కాంతి వనంతోపాటు వీరోచిత పోరాటం చేసిన సైనికుల జీవిత గాథలు, శాసనాలు, వారి విగ్రహాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…