AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించండి.. సీరం, భారత్ బయోటెక్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం..

Coronavirus vaccine prices: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం వేలాది మంది మరణిస్తుండగా.. లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించండి.. సీరం, భారత్ బయోటెక్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం..
Shaik Madar Saheb
|

Updated on: Apr 27, 2021 | 9:16 AM

Share

Coronavirus vaccine prices: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం వేలాది మంది మరణిస్తుండగా.. లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో వ్యాక్సిన్ ధరలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ  భారీ వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో కోవిడ్-19 వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను తగ్గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌యారీ సంస్ధ‌లు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్ సంస్థల‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సోమవార అధికార వ‌ర్గాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్ర ప్రభుతానికి ఒకతీరుగా.. రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు మరో తీరుగా ప్రకటించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ధరల వ్యత్యాసంపై కేంద్రంపై పలువురు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ తరుణంలో.. పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌హా ప‌లు రాష్ట్రాల సీఎంలు వ్యాక్సిన్ ధ‌ర‌ల్లో అస‌మాన‌త‌ల‌ను ప్ర‌శ్నించారు. దీంతో ధ‌ర‌లను తగ్గించాలని కేంద్రం వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల‌ను కోరింది.

ప్ర‌స్తుతం భార‌త్ బ‌యోటెక్ తయారు చేసిన కోవ్యాక్సిన్ ను రాష్ట్రాల‌కు డోస్‌కు రూ 600 చొప్పున‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ 1200కు స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా కేంద్ర ప్ర‌భుత్వానికి వ్యాక్సిన్ డోస్ ను రూ 150 కే స‌ర‌ఫ‌రా చేస్తోంది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. కోవిషీల్డ్ ధ‌ర‌ను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు ఒక్కో డోస్‌కు రూ 400గా నిర్ణ‌యించ‌గా ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు రూ 600కు స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అయితే.. ఈ ధ‌ర‌ల వ్య‌త్యాసం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు విపక్ష పార్టీల నేతల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వ్యాక్సిన్ ధ‌ర‌లను తగ్గించాల‌ని వ్యాక్సిన్ త‌యారీ సంస్ధ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. కాగా.. కేంద్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌నపై సీరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. భార‌త్ బ‌యోటెక్ స్పంద‌న ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కాగా.. జనవరి 16 నుంచి సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 14.19 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించి 100 రోజులైనట్టు వెల్లడించింది.

Also Read:

Corona Effect: ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

దేశంలో క‌రోనా మహోగ్రరూపం… కష్టకాలంలో భారత్‌కు అండగా ఉంటాం.. అవసరమైన వైద్య సహాయాలు అందిస్తాంః అస్ట్రేలియా

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు