రాజు తలచుకుంటే, ఢిల్లీలో లాక్ డౌన్ లోనూ కొనసాగుతున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులు

ఓవైపు కోవిడ్ కేసులు పెరిగిపోతూ ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం...

రాజు తలచుకుంటే, ఢిల్లీలో  లాక్ డౌన్ లోనూ కొనసాగుతున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులు
Central Vista Project Works Continue Even In Lock Down In Delhi
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Apr 28, 2021 | 8:38 AM

ఓవైపు కోవిడ్ కేసులు పెరిగిపోతూ ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ సెంట్రల్ విస్తా ప్రాజెక్టు పనులు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం నిత్యావసర సర్వీసుల పరిధి కిందకు తేవడమే ఇందుకు కారణం. నగర  నడిబొడ్డున సుమారు 1500 కోట్ల వ్యయంతో చేబట్టిన ఈ ప్రాజెక్టుపై సెకండ్ కోవిద్ ప్రభావం ఏ మాంత్రం పడలేదు. కార్మికులను, కూలీలను సమీప ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలించి నిర్మాణ పనులను చేపడుతున్నారు. ఎక్కువమంది కూలీలను ఇక్కడికి సుమారు 16 కి.మీ. దూరంలోని కీర్తి నగర్ నుంచి తీసుకువస్తున్నారు. తమకు రోజుకు 600 రూపాయలు చెల్లిస్తున్నారని, షిఫ్ట్ కు 12 గంటలు పని   చేస్తున్నామని కార్మికులు తెలిపారు. అత్యంత అధునాతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు ఈ  సెంట్రల్ విస్తా ప్రాజెక్టును కేంద్రం చేబట్టింది. 2023 లో జరిగే సార్వత్రిక ఎన్నికల ముందే దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి పక్కాగా ఇది సిద్ధంగా ఉండాలని నిర్దేశించింది.  అయితే  కరోనా కాలంలో ఈ ప్రాజెక్టుపై నిధులను వెచ్చించే బదులు, వ్యాక్సిన్, ఆక్సిజన్,  వైద్య పరికరాలు, ఇతర అవసరాలకోసం నిధులను ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచిస్తున్నారు. ఇది ఇప్పుడు   అత్యంత ప్రధానమా అని ఆయన ప్రశిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులను ప్రస్తుతానికి నిలిపివేసి, కోవిడ్ అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆర్జేడీ నేత మనోజ్ ఝా డిమాండ్ చేస్తున్నారు.

కానీ కేంద్రం మాత్రం ఈ సూచనలను పట్టించుకోవడంలేదు. దీని నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టు లోగడ జనవరిలో ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ గుర్తు చేస్తోంది.  దీన్నినిత్యావసర సర్వీసుల పరిధి కిందకు  చేర్చడానికి ఆ ఉత్తర్వులే కారణమని ఈ పార్టీ  పేర్కొంటోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu