CAA: సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ నిబంధనలు రెడీ అవుతున్నాయి… కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన…

సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ చట్టానికి నిబంధనలు తయారవుతున్నాయని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. ఈ విషయాన్ని

CAA: సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ నిబంధనలు రెడీ అవుతున్నాయి... కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన...
Follow us

| Edited By:

Updated on: Feb 03, 2021 | 4:11 PM

సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ చట్టానికి నిబంధనలు తయారవుతున్నాయని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంటుకు వివరించారు. కాగా… 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

దేశ రాజధాని ఢిల్లీలోని షాహిన్ బాగ్ ఆందోళన కారులు పెద్ద ఎత్తున రోడ్లపై వచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు.ఈ నిరసనలు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే కొద్దిరోజుల వరకు కొనసాగాయి. ఈ చట్టం ప్రకారం.. ఇస్లామిక్ దేశాలు అయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో వివక్షకు గురవుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు(ముస్లిములు మినహా)అందరికీ పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చారు.

అయితే, ఈ చట్టం దేశంలోని ముస్లిములకు వ్యతిరేకంగా తీసుకొచ్చారని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇన్నిరోజుల తర్వాత ఈ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రిపేర్ అవుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. సబార్డినేట్ లెజిస్లేషన్, లోక్‌సభ మరియు రాజ్యసభ కమిటీలు ఈ నిబంధనలను సీఏఏ కింద రూపొందించడానికి ఏప్రిల్ 9 నుంచి జూలై 9వరకు సమయం మంజూరు చేశాయి అని లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.

Also Read: 

Kevin Pietersen: భారత్‌పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు… సహృదయత కలిగిన వారు భారతీయులని కితాబు…

Supreme Court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ .. మరికొందరు జర్నలిస్టులు.. ఎందుకో తెలుసా.?