Supreme Court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ .. మరికొందరు జర్నలిస్టులు.. ఎందుకో తెలుసా.?

కాంగ్రెస్ నేత శశిథరూర్, సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్ దేశాయ్, మరికొందరు జర్నలిస్టులు సుప్రీం కోర్టును...

Supreme Court: సుప్రీం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ .. మరికొందరు జర్నలిస్టులు.. ఎందుకో తెలుసా.?
Follow us

| Edited By:

Updated on: Feb 03, 2021 | 1:12 PM

Delhi Police : కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్, సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్ దేశాయ్, మరికొందరు జర్నలిస్టులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమపై పలు ప్రాంతాల్లో నమోదైన కేసులను కొట్టివేయాలని, ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని పిటిషన్ వేశారు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా వివాదాస్పద ట్వీట్లు చేసినట్లు కాంగ్రెస్ నేత శశిథరూర్, మరికొందరు జర్నలిస్టులపై హర్యానాలోని గురుగ్రామ్‌లో కేసులు నమోదు చేశారు. సీనియర్ జర్నలిస్టులు రాజ్‌దీప్ సర్ దేశాయ్, మృణాల్ పాండే, జాఫర్ ఆగా, పరేష్ నాథ్, వినోద్ కె.జోస్ తదితరుల మీద వివిధ సెక్షన్ల కింద గురుగ్రామ్ సైబర్ సెల్ కేసులు పెట్టింది. కాగా గురుగ్రామ్ కు చెందిన మహావీర్ సింగ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వీటిని దాఖలు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పలు ప్రాంతాల్లో కేసులు…

రైతు ఉద్యమం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివాదాస్పద ట్వీట్లు చేశారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్, పలువురు జర్నలిస్టులపై రోజుల వ్యవధిలో పలు రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేశారు. యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్‌లు సైతం నమోదయ్యాయి. కాగా ట్విట్టర్లలో తప్పుడు, దురుద్దేశపూరితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేశద్రోహం, కుట్ర పూరిత చర్యలకు సంబంధించిన ఐపీసీ లోని ఆయా సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేశారు.

Also Read:

AERO INDIA: బెంగళూరులో ప్రారంభమైన ఎయిర్ షో… సందడి చేస్తున్న యుద్ధ విమానాలు… ఈసారి ప్రత్యేకతేంటంటే..?

INDIA VS ENGLAND: ఇంగ్లండ్‌ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…