AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagmani: కింగ్ కోబ్రా తలపై నిజంగానే నాగమణి ఉంటుందా..? ఇదిగో క్లారిటీ

ఒక్క కాటుకు పెద్ద ఏషియన్ ఏనుగును చంపగల విషాన్ని విడుదల చేస్తుంది రాచనాగు. దీని విషయం శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కాటు పడితే.. 30 నిమిషాలు వ్యవధిలో మనిషి చనిపోతాడు. అయితే కింగ్ కోబ్రా తలపై నిజంగానే నాగమణి ఉంటుందా..? తెలుసుకుందాం పదండి....

Nagmani: కింగ్ కోబ్రా తలపై నిజంగానే నాగమణి ఉంటుందా..? ఇదిగో క్లారిటీ
Snake
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2024 | 12:32 PM

Share

పిరికివారు పాము కనిపిస్తే.. పారిపోతారు.. ధైర్యవంతులు కర్రతో కొట్టి చంపేస్తారు. మూగ జీవాలను ప్రేమించారు.. స్నేక్ కనిపించగానే.. అటవీ శాఖ లేదా స్నేక్ క్యాచర్‌కు సమాచారమిస్తారు. అయితే అరుదైన రాచనాగు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా డేంజరస్ స్నేక్. విష సర్పాల్లో అతి పెద్దది, అతి పొడవైనది ఈ రాచనాగు అని నిపుణులు చెబుతున్నారు. దీన్ని కింగ్ కోబ్రా అంటారు. ఒక్కసారి ఇది కాటేస్తే.. దాని విషంలోని న్యూరో టాక్సిన్లు.. మనిషి మొదడులోని శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో కార్డియాక్‌ అరెస్ట్‌కు గురై ప్రాణం పోయే అవకాశం ఉంది. అయితే రాచనాగు తలపై మణి ఉంటుందని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. ఆ మణి దగ్గర ఉంటే.. మరణం సంభవించదని, సిరి సంపదలు కలిసి వస్తాయని నమ్మకం. ఆ కారణంతోనే అరుదైన రాచనాగులను కొందరు వెంటాడి హతమారుస్తున్నారు. అలానే నాగమణికి మంత్ర శక్తులు కూడా ఉంటాయని కొందరి నమ్మకం. ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు, సీరియల్స్‌ కూడా వస్తాయి.

స్వాతీ నక్షత్రం రోజు.. వర్షం పడినప్పుడు.. ఒక వర్షపు బిందువు పాము నోటిలోకి వెళ్లడం వల్ల మణి తయారవుతుందని కొందరు వాదిస్తుంటారు. మణి ఉన్న పాముకు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వస్తాయన్నది ప్రచారం. అయితే ఇవన్నీ కేవలం కట్టు కథలు మాత్రమే. పాము తలపై రాయిని ముందుగా వారే పెడతారు. దాన్ని మణిగా చెబుతూ మనముందు తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. ఇవన్నీ నమ్మితే మీరు ఫూల్స్ అయినట్లే. ఇదంతా ఓ గారడి విద్య మాత్రమే. అసలు పాములకు ఎలాంటి మణులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. నాగమణి ఉన్నట్లు, అది ఎవరికో ఒకరికి దొరికినట్లు.. చరిత్రలో చిన్న ఆధారం కూడా లేదు. కానీ నాగమణి ఉందని ప్రచారం చేస్తూ కొందరు లక్షల్లో దోచుకుంటారు. అందుకే బీ అలెర్ట్.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..