జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా జైనుల భారీ నిరసనల నేపథ్యంలో పరస్నాథ్ వన్యప్రాణుల అభయారణ్యం సంబంధిత నిబంధనల నిర్వహణ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం (జనవరి 5) కేంద్రం ఆదేశించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం పరస్నాథ్ హిల్స్‌లోని జైన తీర్థయాత్ర కేంద్రమైన శ్రీ సమ్మేద్ శిఖర్జీను పర్యాటక ప్రదేశంగా మార్చాలని నిర్ణయించింది. దీంతో ఇది జైన సమాజాన్ని కలవరపరిచినట్లయింది. దీని ఫలితంగానే సోరెన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. ఈ విషయంపై జైన్ కమ్యూనిటీ ప్రముఖులు కేంద్ర పర్యాటక, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను ప్రత్యేకంగా కలిశారు.
జైన్ కమ్యూనిటీకి చెందిన వివిధ ప్రతినిధులతో జరిగిన సమావేశం తరువాత కేంద్ర మంత్రి పరస్నాథ్ అభయారణ్య నిబంధనలను వెంటనే అమలు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ‘సమావేశం ఫలితంగా పెద్ద పెద్దగా మ్యూజిక్ ప్లే చేయడం లేదా లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం వంటివాటిని నిషేధించే పరస్నాథ్ అభయారణ్యం నిబంధనల నిర్వహణ ప్రణాళికను.. ఖచ్చితంగా అమలు చేయాలని జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది’ అంటూ కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇంకా ‘పవిత్ర స్మారక చిహ్నాలు, సరస్సులు, రాళ్ళు, గుహలు, పుణ్యక్షేత్రాలు వంటి మతపరమైన ఇంకా సాంస్కృతిక ప్రాముఖ్యతలను అపవిత్రం చేయడం, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర మత్తుపదార్థాల అమ్మకం వంటివి నిషేధం. పరస్నాథ్ కొండపై అనధికారిక క్యాంపింగ్, ట్రెక్కింగ్ మొదలైనవి కూడా నిషేధమ’ని కూడా ఆ ప్రకటనలో పర్యాటక శాఖ పేర్కోంది. ఈ క్రమంలోనే పరస్నాథ్ కొండపై మద్యం, మాంసాహార ఆహార పదార్థాల అమ్మకం, వినియోగంపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
GoI led by PM Sh @narendramodi has always respected sentiments of Jain Samaj & recognises Sammed Shikharji Parvat Kshetra as a sacred & revered holy place of the Jain Samaj
GoI has also directed Jharkhand Govt to strictly enforce ban on sale & consumption of liquor and non-veg pic.twitter.com/gPB1L8hALa
— G Kishan Reddy (@kishanreddybjp) January 5, 2023
కేంద్ర పర్యాటక శాఖ సహాయక మంత్రి మంత్రి కిషన్ రెడ్డి పరస్నాథ్ విషయంలో స్పందించారు. ‘ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జైనుల మనోభావాలను ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. సమ్మేద్ శిఖర్జీ పర్వత క్షేత్రాన్ని జైన సమాజానికి పవిత్రమైన పుణ్యక్షేత్రంగా గుర్తిస్తుంది’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..