ఎల్లుండి దేశవ్యాప్తంగా వైమానిక దాడులపై మాక్ డ్రిల్! అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ ఆదేశం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అప్రమత్తతను పెంచేందుకు, వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేయాలని డిసైడ్ అయింది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతాం అని అన్నారు. ఆ తర్వాత పాక్‌పై కొన్ని చర్యలు తీసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం శాఖ కీలక అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈ నెల 7న అంటే బుధవారం రోజు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి, పౌరులు భద్రతా చర్యలు ఎలా పాటించాలనే విషయాలపై అవగాహన కోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది.
పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతల వేళ వైమానిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా రక్షించుకోవాలన్న విషయంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 7వ తేదీన సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. విద్యార్ధులకు ఈ విషయంలో శిక్షణ ఇవ్వాలని కోరింది. సైరన్ మోగగానే ఎలా రక్షణ చేసుకోవాలన్న విషయంపై మాక్‌డ్రిల్‌లో వివరిస్తారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలను ఇప్పటికే దీనిపై అప్రమత్తం చేశారు. సరిహద్దుల లోని విద్యార్ధులకు ఇప్పటికే పూర్తిగా అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శత్రువుల దృష్టి మరల్చడంపై అవగాహన కల్పిస్తారు. 1971 యుద్దం తరువాత దేశంలో తొలిసారి ఈ స్థాయిలో మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




