అమ్మాయిల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్రం

మహిళల పెళ్లి వయస్సు పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దాని కోసం మహిళలు ఏ వయస్సులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న దానిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళల కనీస వివాహ వయస్సు..

అమ్మాయిల వివాహ వయసు పెంచే ఆలోచనలో కేంద్రం
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 2:18 PM

మహిళల పెళ్లి వయస్సు పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దాని కోసం మహిళలు ఏ వయస్సులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్న దానిపై అధ్యయనం చేసేందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మహిళల కనీస వివాహ వయస్సు నిర్థారణ అంశంలో కేంద్రం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు.. ఆగష్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అంశాన్ని పున: పరిశీలించేందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి నుంచి అనే విషయాలపై అనే స్పందనలు, ప్రతిపాదనలు వస్తున్నాయి.

ప్రస్తుతం యువతులకు కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు.. యువకులకు 21 ఏళ్లు. కాగా ఈ వయసును మూడు లేదా నాలుగు సంవత్సరాలు పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. పురుషులతో సమానంగా ఉన్నత చదువులు అభ్యసిస్తున్న మహిళలకు వివాహం ఓ అడ్డంకిగా మారకుండా ఉండేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని చూస్తోంది. ఈ అంశాలపై మరితం క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు.. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది.

Also Read:

కోవిడ్‌తో టాలీవుడ్ నిర్మాత మృతి

బ్రేకింగ్: ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్, వ్యక్తి మృతి

షాకింగ్ న్యూస్: కళ్ళద్దాలపై 9 రోజుల పాటు కరోనా?

వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?