AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి.

Milk Products: పాల ఉత్పత్తుల దిగుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చిచెప్పిన కేంద్రం
Milk
Aravind B
|

Updated on: Apr 09, 2023 | 11:03 AM

Share

దేశంలో పాల ఉత్పత్తుల లీన్ సీజన్ ప్రారంభమైంది. దీంతో వీటి కొరత ఏర్పడటం వల్ల విదేశాల నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని ఇటీవల వార్త కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంపై శనివారం అధికారులు స్పందించారు. మీడియాలో వచ్చే కథనాలు అవాస్తవమని కొట్టిపారేశారు. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే విషయంపై పశుసంరక్షణ విభాగం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఓ మీడియా కథనం ప్రకారం 2022-23 వ్యవధిలో భారత్ లో ప్రైవేట్ పాల ఉత్పత్తుల ఎగుమతులు వెయ్యి శాతం పెరిగి 4.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. నెయ్యి లాంటి కొవ్వు పదార్థాలకు అంతర్జాతీయ మార్కెట్ లో అత్యధికంగా డిమాండ్ ఉండటంతో ఇవి ఎక్కువగా విదేశాలకు దిగుమతి అయ్యాయి. ఈ కారణంగానే పాల ఉత్పత్తులు పెరిగినట్లు నివేదించింది.

అయితే 2022 డిసెంబర్ తో పోల్చుకుంటే 2023 ఫిబ్రవరిలో వెన్న, నెయ్యి నిల్వలు గణనీయంగా పెరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో అకాల వర్షాలు పడటం వల్ల పాల ఉత్పత్తులు పెరగడం కొనసాగాయని పశుసంవర్థక శాఖ సెక్రటరీ రాజేశ్ కుమార్ సింగ్ తెలిపారు. దీనివల్ల పాల ఉత్పత్తుల ధరలు పెరిగాయని.. కానీ వినియోగదారులపై ప్రభావం ఏర్పడిందని తెలిపారు. అయితే రైతులకు మంచి లాభాలు వస్తాయనే ఆలోచనతోనే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధికారి తెలిపారు.ఏప్రిల్ మాసం నుంచి లీన్ సీజన్ ప్రారంభం కావడంతో.. పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంపై పశు సంరక్షణ విభాగం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విభాగం ఎప్పుడు కూడా ఏదైన నిర్ణయాలు తీసుకుంటే పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ముందుకు వెళ్తుందని.. రాజేశ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..