ఈసీని వదలని మహమ్మారి, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకూ కరోనా వైరస్ పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈసీని కూడా మహమ్మారి వదలలేదు . చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ లకు కూడా కరోనా పాజిటివ్ సోకింది.
దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈసీని కూడా మహమ్మారి వదలలేదు . చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ లకు కూడా కరోనా పాజిటివ్ సోకింది. సీఈసీ సునీల్ అరోరా పదవీ విరమణ తరువాత 24 వ సీఈసీ గా సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుతం ఈసీలో మరో పదవిని ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. గతవారమే సుశీల్ చంద్ర పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈయన, రాజీవ్ కుమార్ ఇద్దరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని ఈసీ అధికార ప్రతినిధి చెప్పారు. ముఖ్యంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల కమిషన్ లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం విశేషం. ఇక ఢిల్లీలో తాజాగా 2,706 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 240 మంది కరోనా రోగులు మరణించారు. అంతకు ముందు రోజున 160 మంది మృతి చెందారు.
అటు-దేశంలో కేసులు స్వల్పంగా తగ్గాయి.మంగళవారం 259,170 కి చేరుకున్నాయి. మొత్తానికి ఇండియాలో 20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో రెండు నెలల పాటు దేశంలో ఈ పరిస్థితి ఉండవచ్చ్చునని భావిస్తున్నారు. అయితే యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన పక్షంలో ఈ ఉధృతి తగ్గుతుందని కూడా అంటున్నారు.