AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calcutta High Court: బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు..కలకత్తా హైకోర్టు తీర్పు

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు జరగాలని, ఈ కేసులన్నీ సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. 5 గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ఈ హింస, అల్లర్ల మీద కోర్టు ఆధ్వర్యాన

Calcutta High Court: బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు..కలకత్తా హైకోర్టు తీర్పు
Cbi Probe On Post Poll Violence In Bengal
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 19, 2021 | 12:33 PM

Share

బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసపై సిబిఐ దర్యాప్తు జరగాలని, ఈ కేసులన్నీ సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. 5 గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. ఈ హింస, అల్లర్ల మీద కోర్టు ఆధ్వర్యాన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బిందాల్ నేతృత్వాన గల బెంచ్ సూచించింది. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరిపిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. తన నివేదికను జులై 15 న కోర్టుకు సమర్పించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బదులు రూల్ ఆఫ్ రూలర్ విధానం నడుస్తోందని ఈ సంఘం తన 50 పేజీల నివేదికలో పేర్కొంది. పాలక పార్టీ మద్దతుదారులు. విపక్ష కార్యకర్తలపై దాడులకు దిగారని, అత్యాచారాలు, హత్యల వంటి దారుణాలు జరిగాయని ఈ రిపోర్టులో వెల్లడించింది,

ఈ కేసుపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని, విచారణ రాష్ట్రం బయట జరగాలని కూడా ఈ సంఘం సూచించింది. కలకత్తా హైకోర్టు గత నెల 2 న కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఎన్నికల అనంతరం హింస జరగలేదని ప్రభుత్వం చెబుతోందని, కానీ జరిగిందనడానికి ఈ నివేదికే నిదర్శనమని పేర్కొంది. అయితే ప్రభుత్వంపై మానవ హక్కుల సంఘం చేసిన ఆరోపణలను ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తోసిపుచ్చారు. ఆ సంఘంలోని కొంతమంది సభ్యులకు విపక్ష బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పరు.. కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..! ఏంటో తెలుసా..?Agarwal Sisters Video.

 70 రూపాయల పెట్టుబడితో లక్షల ఆదాయం.. ఎలానో తెలుసా..?: Knowledge Video.

 Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)

 టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు