కర్ణాటకలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కావేరి నది ఉగ్రరూపం దాల్చింది. సెకనుకు లక్ష క్యూసెక్కుల నీరు కావేరి నదిలో ప్రవహిస్తోంది. కావేరి తీర గ్రామాల్లోని ప్రజలకు హైఅలర్ట్ ప్రకటించారు. ఇక్కడి నుంచి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు తోడు చలి తీవ్రత పెరుగుతుండడంతో ఊటీలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అటు తమిళనాడులోనూ కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
కావేరి ఉగ్రరూపంతో తమిళనాడులోని 9 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. కర్నాటక KRS డ్యామ్‌నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణగిరి, ధర్మపురి, సేలంతో సహా 9 జిల్లాలకు అలెర్ట్ ప్రకటించారు. మేటూర్ డ్యామ్‌కు వరద ముప్పు పొంచి ఉందంటున్నారు అధికారులు. వరదల కారణంగా హోగేనక్కల్ జలపాతం మూసివేశారు. పరిసర ప్రాంతాల్లోకి కూడా పర్యాటకులను అనుమతించటం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..