Viral Video: వాగులో కొట్టుకుపోయిన కారు… అందులోని ప్రయాణికులు…
ఉత్తర భారతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కరుస్తోంది. భారీవర్షాలతో రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో సారోలా ప్రాంతంలోని బోరకేడీ దగ్గర ఓ కారు వాగు దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు అందులో...

ఉత్తర భారతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కరుస్తోంది. భారీవర్షాలతో రాజస్థాన్‌లోని ఝాలావాడ్ జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో సారోలా ప్రాంతంలోని బోరకేడీ దగ్గర ఓ కారు వాగు దాటుతుండగా ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు అందులో ఉన్న ముగ్గురిని రక్షించారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. బాధితులను టీచర్ విద్యారాణి, ఆంగన్‌వాడీ కార్యకర్త భావనా మీణా, డ్రైవర్ ఆశిష్ మీణా గుర్తించారు. వీరంతా స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగింది ఈ ఘటన.
వీడియో చూడండి:
ఇక ఢిల్లీలోనూ ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వానతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. అంధేరిలో రద్దీగా ఉండే సబ్‌వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అంధేరీ సబ్‌వేని అధికారులు మూసివేశారు. భారీ వర్షాలు విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
