చంద్రయాన్ 2పై పాక్ సెటైర్.. ఇండియన్స్ ఫైర్!

చంద్రయాన్ 2పై పాక్ సెటైర్.. ఇండియన్స్ ఫైర్!

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దిగుతున్న సమయంలో సరిగ్గా 2.1 కిలోమీటర్ల వద్ద దాని సంకేతాలు తెగిపోయాయి. దీనితో భారతీయులు ఆశలు అడియాశలు అయిపోయాయి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినందుకు భారతదేశం బాధలో ఉంటే.. దాయాది పాకిస్థాన్ మాత్రం పండగ చేసుకుంటోంది. చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ సాధించినప్పుడు ఇండియన్స్ ఎంత సంతోషించి సంబరాలు చేసుకుంటారో.. ఇప్పుడు ఫెయిల్ అయినందుకు […]

Ravi Kiran

|

Sep 08, 2019 | 2:58 AM

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో ఫెయిల్ అయింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దిగుతున్న సమయంలో సరిగ్గా 2.1 కిలోమీటర్ల వద్ద దాని సంకేతాలు తెగిపోయాయి. దీనితో భారతీయులు ఆశలు అడియాశలు అయిపోయాయి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినందుకు భారతదేశం బాధలో ఉంటే.. దాయాది పాకిస్థాన్ మాత్రం పండగ చేసుకుంటోంది. చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ సాధించినప్పుడు ఇండియన్స్ ఎంత సంతోషించి సంబరాలు చేసుకుంటారో.. ఇప్పుడు ఫెయిల్ అయినందుకు పాకిస్తానీలు అలానే సంబరపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తన ట్విట్టర్‌లో చంద్రయాన్ 2 ప్రయోగం ఫెయిల్ అయిందంటూ.. ‘ఎండియా’ అంటూ వెటకారపు ట్వీట్ చేశాడు.

పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్ 2 పై విషం కక్కారు.. ‘రాని పనిలో వేలు పెట్టొద్దు.. డియర్ ఎండియా’ అంటూ వెటకారంగా దేశం పేరును సైతం జత చేసి భారత్‌పై ఉన్న అక్కసును వెళ్లగక్కుకున్నారు. అటు ఇస్రో, భారత్‌‌లను అవహేళన చేస్తూ పలు ట్వీట్లు చేశాడు. ఇక ఈ ట్వీట్లపై భారతీయులు మండిపడ్డారు.

‘చంద్రయాన్ 2పై విషం కక్కిన మంత్రి వర్యా మా ప్రయోగం కోసం నువ్వు రాత్రంతా మేల్కోనే చూశావ్ మరిచిపోకు’ అంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేయగా.. మరొకరు ‘మేం కనీసం ప్రయత్నమైనా చేశామని.. మీ పాకిస్తాన్‌కు ఆ కనీస పరిజ్ఞానం కూడా లేదని’ మండిపడ్డాడు. ఇంతటితో ఈ గొడవ ఆగలేదు. వీటికి ప్రతిస్పందిస్తూ ఫవాద్ చౌదరి రెచ్చిపోయాడు. మరొకొందరైతే శాటిలైట్ స్పెల్లింగ్ కూడా రాదు.. నువ్వెలా మంత్రివి అయ్యావు. అసలు నీకు చంద్రయాన్ 2పై మాట్లాడే అర్హత లేదంటూ గడ్డి పెట్టారు.

చంద్రయాన్ 2 చంద్రుడిపై ల్యాండ్ అవ్వలేదని.. ముంబైలో ల్యాండ్ అయ్యిందని ఎద్దేవా చేశారు. భారత ప్రధాని 900 కోట్ల నిధులను బుగ్గిపాలు చేశాడని.. దీనిపై ప్రతిపక్షాలు నిలదీయాలంటూ ధ్వజమెత్తాడు. మరోవైపు ఇండియన్స్ మాత్రం పాక్ మంత్రిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ.. కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

మరోవైపు ఫవాద్ చౌదరికి ఇలాంటి ట్వీట్లు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఆర్టికల్ 370 రద్దు సమయంలో భారత్‌పై వెకిలి ట్వీట్లు చేసి నెటిజన్లతో తిట్టించుకున్నారు. అటు జమ్మూకాశ్మీర్ అంశం విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మంత్రులు సందు దొరికితే చాలు భారత్‌పై విషం కక్కుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu