AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం రేపుతున్న 18 ఏనుగులు మృతి ఘటన.. ఒక్క మెరుపు అన్ని ఏనుగులను చంపుతుందా..? శాస్త్రవేత్తులు ఏమంటున్నారు..?

Elephants Death: గత వారం కిందట అసోం రాష్ట్రంలో 18 ఏనుగులు మృతి చెందాయి. ఒకేసారి ఇన్ని ఏనుగులు మృత్యువాత పడటం తీవ్ర సంచలనంగా మారింది. పిడుగుపాటుకు..

సంచలనం రేపుతున్న 18 ఏనుగులు మృతి ఘటన.. ఒక్క మెరుపు అన్ని ఏనుగులను చంపుతుందా..? శాస్త్రవేత్తులు ఏమంటున్నారు..?
Subhash Goud
|

Updated on: May 20, 2021 | 7:13 PM

Share

Elephants Death: గత వారం కిందట అసోం రాష్ట్రంలో 18 ఏనుగులు మృతి చెందాయి. ఒకేసారి ఇన్ని ఏనుగులు మృత్యువాత పడటం తీవ్ర సంచలనంగా మారింది. పిడుగుపాటుకు 18 ఏనుగులు చనిపోవడం, వాటి కళేబరాలు కనిపించిన ఘటనపై రకరకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఈ ఏనుగులు ఎలా మృతి చెందాయి..? ఎవరైనా చంపారా..? లేక పిడుగు పాటుకు గురై చనిపోయాయా..? లేక ఏదైనా విష ప్రయోగం జరిగి చనిపోయాయా..? అనే విషయాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒకే సారి 18 ఏనుగులు మృతికి గల కారణాలు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ 18 ఏనుగుల డెత్‌ మిస్టరీని చేధించేందుకు అసోం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నుంచి ఇంకా రిపోర్టు రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా కంనిపించిన ఆధారాలను బట్టి ఆ ఏనుగులు పిడుగు, మెరుపుల వల్లే చనిపోయినట్లు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

పిడుగుపాటుకు ఏనుగులు చనిపోవడం జరిగే పనేనా..?

ఒకే సారి 18 ఏనుగులు మృతి చెందడంపై రకరకాల అనుమానాలకు తావిస్తున్నాయి. అసలు పిడుగుపాటు వల్ల ఏనుగులు చనిపోవడం జరిగే పనేనా అనే ప్రశ్నలను జంతు ప్రేమికులు సంధిస్తున్నారు. రాష్ట్రంలోని బాముని కొండ ప్రాంతం. అక్కడకు తాజాగా వెళ్లిన కొందరికి 18 ఏనుగుల కళేబరాలు కనిపించాయి. వీటిని చూసిన వాళ్లు వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. ఆ కళేబరాలకు పంచనామా నిమిత్తం జంతు వైద్య శాలకు తరలించారు. ఏనుగుల మరణానికి కారణం ఏంటన్నది తేల్చడం కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్ని విధాలుగా దర్యాప్తు చేసి ఆ ఏనుగుల మరణానికి అసలు కారణాలు ఏమిటన్నది త్వరలోనే బయటపెట్టబోతోంది.

వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల చెబుతున్నదేంటి..?

ఏనుగులు మెరుపులు, పిడుగుపాటు వల్లనే చనిపోయాయని కొందరు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు మెరుపు వల్ల ఏనుగులు చనిపోతాయా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏనుగుల మృతికి పిడుగుపాటు ఎలా కారణం అవుతుంది..? అన్న ప్రశ్నలు జంతు ప్రేమికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అయితే వీటికి శాస్త్రవేత్తల నుంచి షాకింగ్ సమాధానాలు వచ్చాయి. ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

సాధారణంగా పెద్ద సైజులో ఉండే ఏనుగులు, పొడవుగా ఉండే జిరాఫీలు వంటి జంతువులు ఖాళీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాటిపై పిడుగు పడే అవకాశం ఉంటుందట. దీనిని డైరెక్ట్ ఫ్లాష్ అని అంటారు. అలాగే ఒక్కోసారి సదరు జంతువులకు సమీపంలో ఉండే పొడవైన చెట్లు ఇతర జీవరాసులపై పడిన పిడుగు అక్కడి నుంచి వక్రీభవనం చెంది జంతువులను తాకినప్పుడు జంతువులు చనిపోయి ఉండవచ్చు. అలాగే మరో కారణం ఏమిటంటే.. వేరే వస్తువుపై పడిన పిడుగు నుంచి విద్యుత్ శక్తి నేలలోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సదరు జంతువు గనుక సమీపంలో ఉన్నట్లయితే భూమి ద్వారా ప్రసరించిన విద్యుత్ సదరు జంతువుల శరీరంలో ప్రవేశిస్తుంది. దీన్ని స్టెప్ పొటెన్షియల్ అంటారు. అసోంలో జరిగిన ఘటన దీనికి సరైన ఉదాహరణ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసోంలో మృతి చెందిన ఏనుగుల కళేబరాలకు పోస్టు మార్టం చేసిన నిపుణులు కూడా పిడుగుపాటు వల్లే సదరు ఏనుగులు మరణించినట్లు భావిస్తున్నారు. అసోంలో కొన్ని ఏనుగుల శరీరాలపై కూడా మెరుపు వల్ల కలిగిన గాయాలు కనిపించాయని తెలుస్తోంది.

ఇక స్టెప్‌ పొటెన్షియల్‌ విధానంలో చాలా జంతువులు మరణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఎత్తైన వస్తువులపై పిడుగు పడినప్పుడు, ఆ సమయంలో ఆ వస్తువును కనుక భారీ సైజులోని జంతువులు పట్టుకొని ఉన్నా కూడా అవి మరణించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇలా కేవలం ఏనుగులకే జరుగుతుందా..?

అయితే ఇలా కేవలం ఏనుగులకే జరుగుతుందా..? అంటే అదేమి లేదు.. కాకపోతే మిగతా జంతువులతో పోలిస్తే ఏనుగులు భారీ సైజులో ఉండటం వల్ల సాధారణంగా ఇవి పిడుగుపాటుకు గురవుతాయనే సమాధానం నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి వస్తోంది. ఇలా పిడుగు పడి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో జంతువులు చనిపోవడం చరిత్రలో ఇదేమి కొత్త కాదు. 1972లో అలస్కాలో 53 జింకలు (రెయిన్‌ డీర్‌లు), ఒక్క మెరుపుతో దెబ్బతిన్నాయి. అలాగే 2016లో కూడా 300పైగా జింకలు కూడా ఇదే తరహాలు మరణించాయి. ఆ తర్వాత 2007లో కూడా పశ్చి బెంగాల్‌లోని బక్సా టైగర్ రిజర్వులో ఐదు ఏనుగులు మెరుపు దాడికి బలయ్యాయి.

ఇవీ చదవండి

Heart Pain: గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంట సమయమే ముఖ్యం.. లేదంటే మరణానికి చేరువయ్యే అవకాశాలు ఎక్కువ..!

Children Covid-19: పిల్లల్లో కరోనా లక్షణాలను ఎలా గుర్తించాలి..? తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలివే..!

Follow Us