విపత్తు నివారణకు యావత్ దేశం సంసిద్ధత.. ప్రజలలో అవగాహన కల్పిస్తూ మాక్‌డ్రిల్!
విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది ఒక సంరక్షణ ప్రక్రియ. ఇందులో విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయడం, హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయడం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు చేసుకోవడం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి.

ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితులకు సంసిద్ధత, ప్రతిస్పందన విధానాలను బలోపేతం చేయడానికి జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ పూర్తి స్థాయి విపత్తు నివారణ మాక్‌డ్రిల్ నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విపత్తు నివారణ సంస్థలు ప్రభుత్వంతో కలిసి నిర్వహించింది. ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్ డ్రిల్ – సిమ్యులేషన్, కోఆర్డినేషన్, అవేర్‌నెస్ ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించడం అనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. NDMA ఆధ్వర్యంలో DMEx కింద భారతదేశం ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్ డ్రిల్, ఆగస్టు 1, 2025న నిర్వహించారు. భూకంపాలు, వరదలు, కరువులు, తుఫానులను సమర్థవంతంగా, సమన్వయం, సంసిద్ధత వ్యక్తం చేస్తూ.. ప్రజలలో అవగాహన పెంచడానికి 18 జిల్లాల్లోని 55 ప్రదేశాల్లో ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు.
భారతదేశం విస్తారమైన, వైవిధ్యమైన భౌగోళిక స్థితి కారణంగా, భూకంపాలు, వరదలు, తుఫానులు, కరువులు, సునామీలు, కొండచరియలు విరిగిపడటం, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అనేక రకాల ప్రకృతి, మానవ ప్రేరిత విపత్తులకు గురవుతుంది. 27 కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విపత్తుకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 58% కంటే ఎక్కువ భూభాగం భూకంప కార్యకలాపాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, విపత్తు సంసిద్ధత ముఖ్య అవసరం.
విపత్తు నిర్వహణలో సంసిద్ధత అనేది ఒక సంరక్షణ ప్రక్రియ. ఇందులో విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా తగిన ప్రణాళికలు వేయడం, హెచ్చరిక వ్యవస్థలు సిద్ధం చేయడం, చట్టబద్ధమైన సంస్థల ఏర్పాటు చేసుకోవడం, వాటి నిర్వహణ, వ్యక్తులకు శిక్షణ వంటివన్నీ ఉంటాయి. ప్రకృతి విపత్తులతో పాటు మానవ కల్పిత విపత్తులు సంభవించినప్పుడు విధ్వంసాన్ని తగ్గించడానికి ముందుగానే తీసుకునే చర్యలన్నీ సంసిద్ధతలో భాగమే. సమర్థ విపత్తు నిర్వహణకు, విపత్తుకు సంబంధించి ఘటనల నిర్వహణకు భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించింది. 2005, డిసెంబరు 23న ‘విపత్తు నిర్వహణ చట్టం’ను తీసుకువచ్చింది. విపత్తు ప్రతిస్పందనను నిర్ధారించడానికి, భారతదేశం ఒక బలమైన సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) విధానాలు, ప్రణాళికలు, మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీలు (SDMA), జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీలు (DDMA) ప్రాంతీయ, స్థానిక స్థాయిలో వీటిని అమలు చేస్తున్నాయి.
విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ (DMEx) వంటి వ్యూహాత్మక చొరవలు ప్రతిస్పందన సంసిద్ధత, సంస్థాగత సమన్వయాన్ని పరీక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రత్యేక దళమైన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), శోధన, రక్షణ, సహాయ కార్యకలాపాలలో ముందు వరుస పాత్ర పోషిస్తుంది. భారతదేశ సమగ్ర విపత్తు నిర్వహణ విధానంలో స్థానిక సంస్థలు, NGOలు, కమ్యూనిటీ వాలంటీర్లు కూడా ముఖ్యమైన భాగస్వాములు అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రజలను విపత్తులను నుండి అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తమకు తాము రక్షించుకుని, తోటి వారిని ఆపదల నుంచి కాపాడేందుకు ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ ప్రిపేర్డ్‌నెస్ డ్రిల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది జాతీయ విపత్తు నివారణ సంస్థ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




