ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కారు ఖరీదు రూ. 100 కోట్లు.. దాని ఫీచర్లు తెలిస్తే మైండ్‌బ్లాక్?
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. దేశంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ దగ్గర అత్యంత ఖరీదైన కారు ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ, భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ముఖేష్ అంబానీ సతీమణి, వ్యాపారవేత్త నీతా అంబానీ సొంతం అని మీకు తెలుసా..?

Nita Ambani's Audi A9 Chameleon Car
- భారతదేశంలో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ. దేశంలోనే అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ దగ్గర అత్యంత ఖరీదైన కారు ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ, భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ముఖేష్ అంబానీ సతీమణి, వ్యాపారవేత్త నీతా అంబానీ సొంతం అని మీకు తెలుసా..? ఈ కారు లక్షణాలు, శక్తివంతమైన ఇంజిన్ గురించి తెలుసుకుందాం.
- అంబానీ కుటుంబం వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ దేశంలో అత్యంత ఖరీదైన కారు ఆడి A9 చామెలియన్. ఈ కారు యజమాని నీతా అంబానీ. నీతా అంబానీ దగ్గర దేశంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది. దీని ధర దాదాపు అక్షరాల రూ. 100 కోట్లు. ఈ ఆడి కారు దాదాపు 600 హార్స్పవర్ శక్తివంతమైన ఇంజిన్‌తో మార్కెట్లో అందుబాటులో ఉంది.
- ఈ ఆడి కారు ప్రత్యేకతను పరిశీలిస్తే, దాని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఈ కారు రంగును కేవలం ఒక బటన్ నొక్కితే మార్చవచ్చు. ఈ కారు పెయింట్ స్కీమ్ విద్యుత్తుతో తయారు చేయడం జరుగుతుంది. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా 11 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
- ఆడి A9 చామెలియన్లో కంపెనీ 4.0 లీటర్ V8 ఇంజిన్‌ను అందించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 600 HP శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా, ఈ కారులో రెండు డోర్లు మాత్రమే రూపొందించారు. ఈ కారు పొడవు దాదాపు 5 మీటర్లు.
- ఈ కారు విండ్‌షీల్డ్, రూఫ్‌ను ఒకదానిలో ఒకటిగా అనుసంధానించారు. అంతేకాకుండా, ఈ లగ్జరీ కారులో మరే ఇతర కారులోనూ కనిపించని అనేక ఆధునిక ఫీచర్లు అందించారు.
- ఈ కారు విండ్‌షీల్డ్, రూఫ్‌ను ఒకదానిలో ఒకటిగా అనుసంధానించారు. అంతేకాకుండా, ఈ లగ్జరీ కారులో మరే ఇతర కారులోనూ కనిపించని అనేక ఆధునిక ఫీచర్లు అందించారు.










