Nirmala on Budget: విపక్షాల విమర్శలకు ఘాటైన సమాధానమిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా..

కేంద్ర బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశామన్నారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చకు సమాధానమిచ్చారు. విపక్షాల విమర్శలకు ఘాటైన సమాధానమిచ్చారు. తెలంగాణ , తమిళనాడుకు కేటాయించిన నిధుల వివరాలను కూడా వెల్లడించారు.

Nirmala on Budget: విపక్షాల విమర్శలకు ఘాటైన సమాధానమిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా..
Nirmala Sitharaman
Follow us

|

Updated on: Jul 30, 2024 | 10:04 PM

కేంద్ర బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేశామన్నారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చకు సమాధానమిచ్చారు. విపక్షాల విమర్శలకు ఘాటైన సమాధానమిచ్చారు. తెలంగాణ , తమిళనాడుకు కేటాయించిన నిధుల వివరాలను కూడా వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్‌పై చర్చకు లోక్‌సభలో సమాధానమిచ్చారు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. విపక్షాల విమర్శలకు ఘాటైన సమాధానమిచ్చారు. తెలంగాణ , , తమిళనాడు, కేరళ సహా వివిధ రాష్ట్రాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపులు జరపలేదనడాన్ని ఖండించారు. కర్నాటక, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలకు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కులు కేటాయించామని వెల్లడించారు.

గ్రీన్ ఫీల్డ్ పార్కులకు రూ.500 కోట్లు కేటాయించామని, బ్రౌన్ ఫీల్డ్ పార్కులకు రూ.200 కోట్లు కేటాయించామన్నారు. బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్ర రైల్వే డబ్లింగ్ పనులకు నిధులు కేటాయించామని తెలిపారు నిర్మల, ఏపీ, తెలంగాణలో మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్లలో రైల్వే డబ్లింగ్ పనులకు, మడికేర్, మేడ్చల్, మహబూబ్ నగర్, డోన్ మార్గంలో డబ్లింగ్ పనులకు, భద్రాచలం, డోర్నకల్ సెక్షన్లలో రైల్వే పనులకు మొత్తం రూ.12,334 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో రూ.1900 కోట్లతో బల్క్‌ డ్రగ్ పార్కులు ప్రకటించినట్లు చెప్పారు.

కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించామన్నారు. రెండు రాష్ట్రాలకే నిధులు కేటాయించినట్టు విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయన్నారు నిర్మలా సీతారామన్‌. వికసిత్‌ భారత్‌ తమ లక్ష్యమన్నారు. ఓబీసీ నేత ప్రధాని కావడాన్ని కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోవడం లేదన్నారు. మోదీపై ప్రజలు మూడోసారి విశ్వాసం ఉంచారన్నారు. స్థిరత్వం, ప్రజాశ్రేయస్సు విధానాలను తీసుకున్నామన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికస్ స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

విపక్ష నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు-నిర్మల
విపక్ష నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు-నిర్మల
గిరిజన మహిళల కోసం చంద్రబాబు కీలక నిర్ణయం
గిరిజన మహిళల కోసం చంద్రబాబు కీలక నిర్ణయం
చిరంజీవి అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పీవీ సింధు
చిరంజీవి అంకుల్ రావడం ఆశ్చర్యం కలిగించింది: పీవీ సింధు
ఇండియన్ 2 మత్తులో పడి.. 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో సైడ్
ఇండియన్ 2 మత్తులో పడి.. 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో సైడ్
బుధవారం ఈ పూలతో వినాయ‌కుడిని పూజిస్తే మీ కష్టాల‌న్నీతొల‌గిపోతాయి!
బుధవారం ఈ పూలతో వినాయ‌కుడిని పూజిస్తే మీ కష్టాల‌న్నీతొల‌గిపోతాయి!
అద్భుతం.. ఈ పండు తింటే క్షణాల్లోనే బ్లడ్ షుగర్ కంట్రోల్..
అద్భుతం.. ఈ పండు తింటే క్షణాల్లోనే బ్లడ్ షుగర్ కంట్రోల్..
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
చర్మంపై వృద్ధాప్య ముడతలకు చెక్‌ పెట్టే అద్భుత ఆయిల్‌..
చర్మంపై వృద్ధాప్య ముడతలకు చెక్‌ పెట్టే అద్భుత ఆయిల్‌..
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన ఐశ్వర్యా అర్జున్.. ఫొటోస్ వైరల్
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన ఐశ్వర్యా అర్జున్.. ఫొటోస్ వైరల్
వీడేం మనిషి..? అక్కడ ప్రాణం పోతుంటే.. కూల్‌డ్రింక్స్‌ చోరీచేస్తూ.
వీడేం మనిషి..? అక్కడ ప్రాణం పోతుంటే.. కూల్‌డ్రింక్స్‌ చోరీచేస్తూ.