AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్‌‌లో గుడ్ న్యూస్.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక ప్రకటనలు చేశారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి.

Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్‌‌లో గుడ్ న్యూస్.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
Light
Janardhan Veluru
|

Updated on: Feb 01, 2024 | 12:07 PM

Share

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే కీలక ప్రకటనలు చేశారు. రూఫ్ టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి.విద్యుత్ బిల్లుల నుంచి విముక్తికి కొత్త సోలార్ పథకం ప్రకటించినట్లు చెప్పారు. అలాగే సొంత ఇళ్లులేని పేద, మధ్యతరగతికి చెందిన వారికి తీపి కబురు చెప్పారు నిర్మలా సీతారామన్. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్లనున్నట్లు తెలిపారు. తద్వారా బస్తీలు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారి సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. అలాగే పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సమగ్ర కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద ఎరువు అందజేస్తామని ప్రకటించారు.

పరిశోధన, సృజనాత్మకకు రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జిల్లాలు బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాటు అందిస్తామన్నారు. సంస్కరణల అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు. విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్న ఆర్థిక మంత్రి… విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగమన్నారు. మౌలిక వసతుల రంగానికి రూ.11.11 లక్షల కోట్ల కేటాయింపులు చేయనున్నట్లు ప్రకటించారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోని ఇతర కీలక అంశాలు..

– పరిశోధన, సృజనాత్మకకు లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం..

– మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం

– 40వేల నార్మల్‌ బోగీలను వందేభారత్‌ ప్రమాణాలకు పెంచుతాం

– యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం..

– 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం..

– లక్ష కోట్లతో ప్రైవేట్‌ సెక్టార్‌కి కార్పస్‌ ఫండ్‌

– టూరిస్ట్‌ హబ్‌గా లక్షద్వీప్‌

– 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు

– 3 మేజర్‌ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నాం..

– వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం

– 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

– ఈ 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి

– దేశంలో మరిన్ని మెడికల్‌ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు

– రూఫ్‌టాప్‌ సోలార్‌ పాలసీతో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

– 80 కోట్ల మందికి ఫ్రీరేషన్‌తో ఆహార సమస్య తీర్చాం..

– మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం..

– వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం..

– ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది

– GDP అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్‌ఫార్మెన్స్‌

– మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు ఇచ్చాం..

– 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 7 ఐఐఎంలు..

– 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాం..

– స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీతో యువతకు ఉద్యోగాలు

– 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిలు 28 శాతం పెరిగారు..

– 11.8 కోట్ల మంది అన్నదాతలకు ఆర్థిక సాయం

– 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం

– జన్‌ధన్‌ ఖాతాలతో పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం..

– స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు

– లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు

– 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేస్తాం

– నానో యూరియా తర్వాత పంటలకు నానో DAP కింద ఎరువులు అందిస్తాం

– అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజ్‌

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!