AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాకు గట్టి దెబ్బ.. బీఎస్ఎన్ఎల్‌కు పలు సూచనలు చేసిన కేంద్రం

సరిహద్దుల్లో దొంగదెబ్బ కొట్టిన చైనాకు మొదటి దెబ్బ పడింది. 4జీ అప్‌గ్రేడ్ నిమిత్తం ఉపకరణాలను వినియోగించవద్దని బీఎస్ఎన్ఎల్‌ను కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆదేశించింది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆగడాలకు నిరసనగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ తోపాటు వాటి పరిధిలోని విభాగాలన్నీ సాధ్యమైనంతవరకు మేకిన్ ఇండియా ఉత్పత్తులనే వినియోగించాలని సూచించింది. ఇప్పటికే బాయ్‌కాట్ చైనా పేరుతో అక్కడి ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని కొందరు వ్యక్తిగతంగా […]

చైనాకు గట్టి దెబ్బ.. బీఎస్ఎన్ఎల్‌కు పలు సూచనలు చేసిన కేంద్రం
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jun 18, 2020 | 11:36 AM

Share

సరిహద్దుల్లో దొంగదెబ్బ కొట్టిన చైనాకు మొదటి దెబ్బ పడింది. 4జీ అప్‌గ్రేడ్ నిమిత్తం ఉపకరణాలను వినియోగించవద్దని బీఎస్ఎన్ఎల్‌ను కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ఆదేశించింది. సరిహద్దుల్లో చైనా చేస్తున్న ఆగడాలకు నిరసనగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ తోపాటు వాటి పరిధిలోని విభాగాలన్నీ సాధ్యమైనంతవరకు మేకిన్ ఇండియా ఉత్పత్తులనే వినియోగించాలని సూచించింది.

ఇప్పటికే బాయ్‌కాట్ చైనా పేరుతో అక్కడి ఉత్పత్తులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇలాంటి ప్రచారాన్ని కొందరు వ్యక్తిగతంగా చేస్తున్న పోస్టులు కాగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే ఇప్పటికే చైనాతో లింక్ ఉన్న 52 మోబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని లేదా.. వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి  భారత ఇంటెలిజెన్స్ అధికారులు  సూచనలు చేశారు. ఈ జాబితాలో జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్, క్లీన్ మాస్టర్‌తో పాటు మరో 52 అప్లికేషన్లను ఇంటెలిజెన్స్ అధికారులు తమ జాబితాలో పేర్కొన్నారు.

Follow Us