Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ నేత యడుయూరప్ప ఇంటి వద్ద ఉద్రిక్తత… నిరసనకారుల రాళ్ల దాడి, పోలీసుల లాఠీ చార్జ్

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడుయూరప్ప ఇంటి వద్ద ఉద్రితక్తత చెలరేగింది. నిరసనకారులు ఆయన ఇంటిన ముట్టడించి రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలు అక్కడికి చేరుకున్నారు. వందలాది మందిని అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు.

బీజేపీ నేత యడుయూరప్ప ఇంటి వద్ద ఉద్రిక్తత... నిరసనకారుల రాళ్ల దాడి, పోలీసుల లాఠీ చార్జ్
Bs Yediyurappa
Follow us
Aravind B

|

Updated on: Mar 27, 2023 | 5:47 PM

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడుయూరప్ప ఇంటి వద్ద ఉద్రితక్తత చెలరేగింది. నిరసనకారులు ఆయన ఇంటిన ముట్టడించి రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలు అక్కడికి చేరుకున్నారు. వందలాది మందిని అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అధికారంలంలో ఉన్న సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా, ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్సీ వర్గాలకు కేటాయించిన 17 శాతం రిజర్వేషన్లను ఉపవర్గాల వారిగా విభజించాలని సూచించింది.

అయితే ఈ నిర్ణయాన్ని బంజారా, ఇతర వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని బంజారా సంఘం సభ్యులు, నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శివమొగ్గ జిల్లాలోని షికారిపురాలో బీజేపీ సీనియర్‌ నేత యడియూరప్ప ఇల్లు, కార్యాలయం వద్ద సోమవారం మధ్యాహ్నం బంజారా, భోవి సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల పైకి రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో అధికారులు అదనపు బలగాలను రప్పించారు. పోలీసులకు నిరసనకారులకు మధ్య సంఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో కొంతమంది పోలీసులు గాయాలయ్యాయి. చివరికీ ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..