Rahul Gandhi: 30 రోజుల్లో ఆ బంగ్లాను ఖాళీ చేయండి.. రాహుల్ గాంధీకి లోక్‌సభ హౌస్ కమిటీ నోటీసులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. దీని తర్వాత తాజాగా మరో నోటీసును అందుకున్నారు రాహుల్.. నెల రోజుల్లోగా ఆయన తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి..

ప్రభుత్వ బంగ్లా నుంచి బయటకు వెళ్లాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వం అనంతరం లోక్‌సభ హౌస్ కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. అనర్హత వేటు పడ్డ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తన నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ అయ్యాయి. నెల రోజుల్లో రాహుల్ తన నివాసాన్ని ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీ లోని 12 తుగ్లక్ రోడ్‌లో రాహుల్ నివాపం ఉంటుంది. ఎంపీ సభ్యత్వం రద్దు కావడంతో ఆయనకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రాహుల్ గాంధీ 12 తుగ్లక్ లేన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో నివసిస్తున్నారు. ఏప్రిల్ 22 నాటికి రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. నోటీసు ప్రకారం, అనర్హత వేటు వేసిన ఒక నెలలోగా.. రాహుల్ గాంధీ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది.
‘మోదీ ఇంటిపేరు’కు సంబంధించిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై 2019లో నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత శుక్రవారం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడింది.
ఆయన అనర్హత వేటు మార్చి 23 నుంచి అమల్లోకి వస్తుందని లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1), ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 ప్రకారం అతను (రాహుల్ గాంధీ) అనర్హుడని నోటిఫికేషన్ పేర్కొంది.
లోక్‌సభకు అనర్హత వేటు పడిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం మాట్లాడుతూ.. తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా.. లేకున్నా.. జైలులో పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటానని అన్నారు. తన పేరు గాంధీ అని, సావర్కర్ కాదని, గాంధీ క్షమాపణ చెప్పనందున తాను భయపడనని, క్షమాపణ చెప్పనని కూడా అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం