AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రాక్షసులు మళ్లీ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నా..ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కీస్ బానో అనే మహిళను రేప్ చేసి తన కుటుంబ సభ్యులను చంపిన 11 మందిని దోషుల్నీ ఇటీవల విడుదల చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వారిని మళ్లీ జైలుకు తరలించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ రాక్షసులు మళ్లీ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నా..ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
Mahua Moitra
Aravind B
|

Updated on: Mar 27, 2023 | 5:12 PM

Share

గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కీస్ బానో అనే మహిళను రేప్ చేసి తన కుటుంబ సభ్యులను చంపిన 11 మందిని దోషుల్నీ ఇటీవల విడుదల చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వారిని మళ్లీ జైలుకు తరలించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై పెద్దఎత్తున్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యాలు చేశారు. బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ కేసులో 11 మంది దోషుల్లో ఒకరు గుజరాత్ లోని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై వేదిక పంచుకోవడంపై ఎంపీ మొయిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో వాళ్లు వేదికపై కలిసి కూర్చున్న ఫోటోను షేర్ చేశారు. నేను ఈ రాక్షసులను మళ్లీ జైలుకు వెళ్లడం చూడాలనుకుంటున్నానని తెలిపారు. అన్యాయాన్ని ప్రశంసించే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలంటూ రాసుకొచ్చారు. భారత్ తిరిగి తన నైతిక పరిధిని సొంతం చేసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే బిల్కిస్ బోనో రేప్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన రేపిస్ట్ శైలేష్‌ చిమన్‌లాల్‌ భట్‌ దాహోద్… బీజేపీ ఎంపీ జస్వంత్‌సిన్హ్ భభోర్,అతని సోదరుడు, లింఖేడా ఎమ్మెల్యే శైలేష్ భాభోర్‌తో కలిసి నీటి సరఫరా పథకం ప్రారంభోత్సవానికి హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఎంపీ మొయిత్రా పాలక బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 2008లో బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులకు ముంబయిలోని సీబీఐ కోర్టు జీవిత ఖైదు శిక్ష వేయగా.. ఈ తీర్పును ముంబయి హైకోర్టు.. సుప్రీంకోర్టులు కూడా సమర్థించాయి. అయితే గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ దోషులను ముందస్తుగా విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?