BRS: మహారాష్ట్రాలో బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనం.. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా..

|

Jun 13, 2023 | 12:04 PM

మహారాష్ట్రాలో బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని ప్రారంభించబోతున్నది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. ఆ భవనాన్ని ఈ నెల 15న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.

BRS: మహారాష్ట్రాలో బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనం.. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా..
BRS Party Chief CM KCR
Follow us on

తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది బీఆర్‌ఎస్‌. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  ప్రారంభించనున్నారు. 15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు. ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు పార్టీ భవనాల కోసం వెతుకుతున్నారు. మరోవైపు.. ఈ నెల 19న నాందేడ్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో తిరుగులేని పార్టీగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దూసుకుపోతోంది. మొదట మహారాష్ట్ర నుంచి ఈ పార్టీ జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు. ఇప్పటికే పలు మార్లు బహిరంగ సభలు నిర్వహించి అక్కడి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ సారి షోలాపూర్‌‌, నాగపూర్‌‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. అయితే, ఇందులో ముందుగా చంద్రపుర్‌ భారీ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది బీఆర్‌ఎస్‌.  చంద్రపుర్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ సభలో స్థానిక కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం