Wedding: మరికాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో మరణించిన నవవధువు.. చివరకు ఏం జరిగిందంటే..

వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది.. వరుడు బరాత్‌తో వధువు ఇంటికి చేరుకున్నాడు. మరికాసేపట్లో పెళ్లి అనగా.. ఓ షాకింగ్ ఘటన జరిగింది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు

Wedding: మరికాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో మరణించిన నవవధువు.. చివరకు ఏం జరిగిందంటే..
Crime News

Updated on: Feb 25, 2023 | 6:32 PM

వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది.. వరుడు బరాత్‌తో వధువు ఇంటికి చేరుకున్నాడు. మరికాసేపట్లో పెళ్లి అనగా.. ఓ షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి పీటలెక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి చెందడంతో.. వివాహా వేడుక శోకసంద్రంలో మునిగింది. ఈ సమయంలో వధువు కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. మృతి చెందిన కుమార్తె స్థానంలో ఆమె చెల్లినిచ్చి వివాహం జరిపించారు. ఈ షాకింగ్ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌ లో చోటుచేసుకుంది.

భావ్‌నగర్‌ జిల్లా సుభాశ్‌ నగర్‌కు చెందిన జినాభాయ్‌ రాథోడ్‌ పెద్ద కుమార్తె హేతల్‌కు.. నారీ గ్రామానికి చెందిన విశాల్‌ రాణాభాయ్‌తో గురువారం వివాహం జరగాల్సి ఉంది. విశాల్‌భాయ్‌ ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే హేతల్‌ స్పృహతప్పి పడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె గుండె పోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పెళ్లి జరగాల్సిన రోజే నవవధువు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

ఈ మసయంలో మృతురాలి కుటుంబం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హేతల్‌ స్థానంలో ఆమె చెల్లిని విశాల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకన్నారు. దీనికి విశాల్‌ కుటుంబం అంగీకరించడంతో.. అదే ముహుర్తానికి ఇద్దరికీ పెళ్లి చేశారు.

ఇవి కూడా చదవండి

హేతల్‌ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి చిన్న కుమార్తెను విశాల్‌కు ఇచ్చి వివాహం జరిపించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. అనంతరం ఆమె అంత్యక్రియలను నిర్వహించినట్లు భావ్‌నగర్‌ కార్పొరేటర్‌, మల్ధారీ సమాజ్‌ నాయకుడు లక్ష్మణ్‌భాయ్‌ రాథోడ్‌ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..